Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది

Viral Video: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి, ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యంతో పాటు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఓ 80 ఏళ్ల బామ్మ ట్రాక్టర్ నడుపుతూ చూపించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె స్టైల్, పట్టుదల నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఈ బామ్మ కేవలం ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయడమే కాదు. దాన్ని పూర్తి స్టైల్లో నడుపుతూ రీల్ కూడా చేయించుకున్నారు. ఆమె ముఖంలో కనిపించిన ఆ ఆత్మవిశ్వాసం, చిరునవ్వు నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. అమ్మో, ఇంత ధైర్యం, ఇంత ఆత్మవిశ్వాసం మాకు కూడా ఉంటే బాగుండు అని అంటున్నారు. సాధారణంగా యువకులు కూడా ట్రాక్టర్ నడపడానికి కొంచెం భయపడతారు. కానీ 80 ఏళ్ల బామ్మ ఎలాంటి బెరుకు లేకుండా స్టీరింగ్‌ను పట్టుకుని, గేర్లు మార్చుతూ ట్రాక్టర్‌ను నడిపిన తీరు చాలా అద్భుతంగా ఉంది.
Read Also:Google Chrome : ఈ తేదీ తర్వాత మీ ఫోన్లలో గూగుల్ క్రోమ్ బంద్
बस इतना ही हौसला चाहिए मुझे… ☺ pic.twitter.com/ZEVgUr4XZZ
— Shivani Sahu (@askshivanisahu) June 21, 2025
ఈ అద్భుతమైన వీడియోను జూన్ 21న @askshivanisahu అనే X హ్యాండిల్ నుంచి షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభించింది. ఇప్పటివరకు 80 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను చూశారు. అంతేకాదు, నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ ప్రశంసలను కురిపిస్తున్నారు.
ఒక యూజర్.. బామ్మ ఎంత ధైర్యం ఉందో, అంత ధైర్యం మాకు కూడా కావాలి అని రాస్తే, మరో యూజర్.. వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని బామ్మ మరోసారి నిరూపించారు అని కామెంట్ చేశారు. ఈ వీడియో చూస్తే జీవితాన్ని ప్రతి దశలోనూ పూర్తి ఉత్సాహంతో ఆస్వాదించాలని, వయసు అనేది దానికి అడ్డు కాదని రుజువు చేస్తుంది.
Read Also:SS Rajamouli: మహేష్ మూవీని పక్కనపెట్టి రాజమౌళి జపాన్ గేమ్.. వైరల్ వీడియో
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం