Google Chrome : ఈ తేదీ తర్వాత మీ ఫోన్లలో గూగుల్ క్రోమ్ బంద్

Google Chrome : గూగుల్ యూజర్లకు క్రోమ్ సపోర్ట్‌ను నిలిపివేయడం కొత్తేం కాదు. గతంలో కూడా చాలాసార్లు జరిగింది. గూగుల్ మాత్రమే కాదు, వాట్సాప్ కూడా కొన్ని రోజులకోసారి పాత స్మార్ట్ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేస్తూ ఉంటుంది. అయితే, గూగుల్ లేదా ఏ ఇతర కంపెనీ అయినా ఇలా ఎందుకు చేస్తాయి? ఇప్పుడు గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి యూజర్లను ప్రభావితం చేస్తుంది? అలాగే, మీరు గూగుల్ క్రోమ్‌ను ఉపయోగించడం కొనసాగించాలంటే ఏం చేయాలో ఈ వార్తలో తెలుసుకుందాం.
కంపెనీలు పాత ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయడానికి ప్రధాన కారణం, కొత్త వెర్షన్ ఫోన్లను ఉపయోగించే వారికి మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టడమే. పాత ఆపరేటింగ్ సిస్టమ్‌ల కోసం అప్డేట్లను తయారు చేయడం.. వాటికి సపోర్ట్ అందించడం కంపెనీలకు అదనపు ఖర్చు, శ్రమతో కూడుకున్న పని.
Read Also:SS Rajamouli: మహేష్ మూవీని పక్కనపెట్టి రాజమౌళి జపాన్ గేమ్.. వైరల్ వీడియో
గూగుల్ తెలిపిన ప్రకారం.. ఆండ్రాయిడ్ 8, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తున్న స్మార్ట్ఫోన్లకు క్రోమ్ సపోర్ట్‌ను నిలిపివేయనున్నారు. ఈ రెండు మోడల్స్‌పై పనిచేసే ఫోన్ల కోసం కంపెనీ ఇప్పటికే చివరి క్రోమ్ వెర్షన్ 138ను విడుదల చేసింది. ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే ఫోన్లలో క్రోమ్ బ్రౌజర్ ప్రస్తుతం పనిచేస్తుంది. కానీ, కంపెనీ ఈ స్మార్ట్ఫోన్లకు భవిష్యత్తులో వచ్చే అప్డేట్లు,సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించదు.
కంపెనీ పాత ఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేస్తే, దాని అర్థం మీరు సెక్యూరిటీ పరంగా రిస్క్‌లో ఉన్నట్లే. ఎందుకంటే మీకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లు లభించవు. దీనివల్ల మీ ఫోన్ హ్యాకింగ్‌కు లేదా ఇతర సైబర్ దాడులకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. ఆగస్టు 5 తర్వాత, ఆండ్రాయిడ్ 8 (ఓరియో), ఆండ్రాయిడ్ 9 (పై) ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తున్న స్మార్ట్ఫోన్లలో గూగుల్ క్రోమ్ పనిచేయదు.
Read Also:Ajith Kumar : ఎంతో స్టైలిష్ గా ఉండే హీరో అజిత్ కుమార్ ఏంటి ఇలా అయిపోయాడు
క్రోమ్ వెర్షన్ 139, భవిష్యత్తు సెక్యూరిటీ అప్డేట్లు పొందాలనుకుంటే ఆండ్రాయిడ్ 10 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌పై పనిచేసే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయడం ద్వారా క్రోమ్‌ను నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే, వేరే బ్రౌజర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది.
-
Mobile Apps: అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి
-
AI blackmails developer: నీ రిలేషన్స్ అన్ని బయట పెడతా.. డెవలపర్‌కి ఏఐ బ్లాక్ మెయిల్
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇన్స్టాగ్రామ్ పని అయిపోయినట్లేగా!
-
Google Chrome : బెస్ట్ గూగుల్ క్రోమ్ ట్రిక్స్ ఇవే
-
AI : AI కి కూడా ఒత్తిడి, ఆందోళన ఉంటాయా? షాకింగ్ విషయాలు వెల్లడి.
-
Google Maps : వామ్మో గూగుల్ మ్యాప్స్ వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయా? గుడ్డిగా నమ్మవద్దా?