Google Chrome : బెస్ట్ గూగుల్ క్రోమ్ ట్రిక్స్ ఇవే
Google Chrome: ప్రతీ ఒక్క వ్యక్తి రోజులో ఒక్కసారైనా క్రోమ్ వాడుతారు. ఏదో ఒకటి సెర్చ్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ట్రిక్స్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల క్రోమ్ వాడటానికి చిరాకు పడుతుంటారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రోమ్ వాడాలంటే మాత్రం కొన్ని ట్రిక్స్ గురించి తెలియాల్సిందే. మరి ఆ క్రోమ్ ట్రిక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Google Chrome : బ్రౌజర్లలో గూగుల్ క్రోమ్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా డైలీ ఎందరో దీన్ని వాడుతారు. డైలీ ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటారు. అయితే వీటిలో మనకి తెలియని చాలా షార్ట్‌కట్స్ ఉన్నాయి. ఇవి తెలియక క్రోమ్ వాడేటప్పుడు కొందరు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అయితే గూగుల్ క్రోమ్‌లో ఉండే కొన్ని బెస్ట్ ట్రిక్స్ తెలుసుకోండి. అవి మీకు బాగా ఉపయోగపడతాయి. చదువు, సినిమా, షాపింగ్ ఇలా ఏవైనా విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది క్రోమ్ ఉపయోగిస్తారు. ప్రతీ ఒక్క వ్యక్తి రోజులో ఒక్కసారైనా క్రోమ్ వాడుతారు. ఏదో ఒకటి సెర్చ్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ట్రిక్స్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల క్రోమ్ వాడటానికి చిరాకు పడుతుంటారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రోమ్ వాడాలంటే మాత్రం కొన్ని ట్రిక్స్ గురించి తెలియాల్సిందే. మరి ఆ క్రోమ్ ట్రిక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
యూఆర్‌ఎల్స్ షేర్
ఒకటే గూగుల్ క్రోమ్ అకౌంట్‌ను ఒకే డివైజ్‌లో కాకుండా వేర్వేరు డివైజ్‌లో కొందరు వాడుతుంటారు. ఎందుకంటే కొందరు స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ ఇలా రకరకాల డివైజ్‌లు వాడుతుంటారు. వీటిలో మీరు ఒకేసారి యూఆర్‌ఎల్స్ షేర్ చేసుకోవచ్చు. మీరు ల్యాప్‌టాప్‌లో వాడేటప్పుడు ఏదైనా లింక్ కనిపిస్తే సెండ్ టు యువర్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దీంతో ఆ లింక్ బ్రౌజర్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత మీకు నచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు.
పిన్.. అన్ పిన్
ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు చూస్తారు. మళ్లీ దాన్ని ఇంకోసారి చూడాలంటే మాత్రం దొరకదు. ఇలా మరిచిపోకూడదంటే క్రోమ్ బ్రౌజర్‌లో ఎడమ వైపు పిన్ చేసుకోవచ్చు. దీంతో మీకు నచ్చినప్పుడు వెతకకుండా చూసుకోవచ్చు.
ఆటోఫిల్
క్రోమ్‌లో కొందరు జాబ్‌లకు అప్లై చేస్తుంటారు. ప్రతీసారి పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, చిరునామా.. ఇలా ఎంటర్ చేయాలంటే కష్టం. కాబట్టి ఆటోఫిల్ పెట్టుకుంటే సమయం ఆదా అవుతుంది. ఆటోఫిల్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే బ్రౌజర్ ఆటోమెటిక్‌గా అన్ని తీసుకుంటుంది. ఆఖరికి పాస్వార్డ్‌ల విషయంలో కూడా అంతే.
గూగుల్ లెన్స్
ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాలంటే అలాంటిదే మళ్లీ దొరకదు. ఇలాంటి సమయాల్లో గూగుల్ లెన్స్ బాగా ఉపయోగపడుతుంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్
రివర్స్ ఇమేజ్ సెర్చ్ కూడా ఫొటోలు కోసం. మీకు కావాల్సిన ఏదైనా వస్తువు అందులో అప్‌లోడ్ చేస్తే దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా వెబ్‌సైట్‌లో వస్తాయి.