Google Maps : వామ్మో గూగుల్ మ్యాప్స్ వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయా? గుడ్డిగా నమ్మవద్దా?

Google Maps :
విహారయాత్రకైనా, పరీక్షకైనా, ఎటు వెళ్లినా సరే రోడ్డు గురించి మార్గం గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే జై గూగుల్ తల్లి అనాల్సిందే. అందరూ అదే బాట పడుతున్నారు కూడా. బాట తెలియకపోతే ఏంటి గూగుల్ తల్లి ఉంది కదా అనుకుంటే ప్రతిసారి పాజిటివ్ జరగకపోవచ్చు. పూర్తిగా Google Maps పై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? గూగుల్ మాప్స్ తో ప్రమాదం ఏంటి అనుకుంటున్నారా? నిజమే రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే మీకు ఈ విషయం క్లారిటీగా అర్థం అవుతుంది.
పరీక్షలకు ఆలస్యం:
రాజస్థాన్‌లో జరిగిన REET పరీక్షకు సంబంధించి గూగుల్ మ్యాప్ వల్లే ఆలస్యం అయింది. గూగుల్ మ్యాప్స్ కారణంగా, చాలా మంది అభ్యర్థులు దారి తప్పి పరీక్షకు దూరమయ్యారు. గూగుల్ మ్యాప్స్ కారణంగా తాము పరీక్షా కేంద్రంలోని అవతలి గేటు వద్దకు చేరుకున్నామని చాలా మంది అభ్యర్థులు తెలిపారు. వారు కుడి గేటు వద్దకు చేరుకునే సమయానికి, పరీక్ష అప్పటికే ప్రారంభమైపోయింది. చాలా మంది అభ్యర్థులను 30 సెకన్లు ఆలస్యమైనా పరీక్షకు హాజరుకాకుండా ఆపేశారు. చూశారా గూగుల్ మాప్స్ ఎంత పని చేసిందో..
గూగుల్ మ్యాప్ వల్లే దోపిడీ జరిగింది.
ఈ సంఘటన 2025 ఫిబ్రవరి 5న జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో, గూగుల్ మ్యాప్ కారణంగా ఒక యువకుడు దారి తప్పి, అతని కారు పొలంలో చిక్కుకుంది. సహాయం కోసం దారిన వెళ్ళేవారిని వేడుకున్నాడు. కానీ అప్పుడే సమస్య మరింత పెరిగింది. సహాయం చేస్తున్నారనే నెపంతో అక్కడికి చేరుకున్న వ్యక్తులు అతన్ని మోసం చేసి కారు, మొబైల్‌తో ఉడాయించారు.
ప్రాణం తీసింది: డిసెంబర్ 2024 లో కూడా గూగుల్ మ్యాప్ కారణంగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. నిజానికి, బిజ్నోర్ జిల్లాలోని ధాంపూర్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఢిల్లీ నుంచి ధాంపూర్‌కు తిరిగి వస్తున్నాడు. గూగుల్ మ్యాప్ అతనికి నహ్తౌర్ సమీపంలో తప్పుడు మార్గాన్ని చూపించింది. దాని కారణంగా అతని బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వంతెన వద్ద ఏం జరిగిందంటే?
గూగుల్ మ్యాప్స్ వల్ల ప్రజలు తప్పుడు మార్గంలో పయనించారు. అంతేకాదు వారి మరణానికి కూడా కారణం అయింది. ఈ ప్రమాదం యూపీలోని బరేలీలో జరిగింది. నవంబర్ 2024లో, ముగ్గురు యువకులు తమ కారులో బంధువుల వివాహానికి వెళ్తున్నారు. అయితే వారు గూగుల్ మ్యాప్స్ చూస్తుండగా దారి ఒక వంతెన వైపు వెళ్లింది. ప్రమాదం గుర్తించకపోవడంతో వరదల్లో కారు సగం కొట్టుకుపోయింది. ఏకంగా వంతెనపై నుంచి కిందపడింది కూడా. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మరణించారు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, Google ని పూర్తిగా నమ్మవద్దు. ఈ సమయంలో, చుట్టుపక్కల వాహనాలను కూడా గమనించండి. మీరు అకస్మాత్తుగా తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. మీరు దారి తప్పిపోతారని మీకు అనిపిస్తే, సమీపంలోని వ్యక్తులతో మాట్లాడి సరైన దారి తెలుసుకోవడం అవసరం. గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. రాత్రి లేదా ఘాటు ప్రాంతాల్లో ప్రయాణిస్తుంటే మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
-
Google New Feature: గూగుల్ సెర్చింగ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా.. ఇక బ్రౌజర్లకు పండగే
-
YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
-
Google Chrome : ఈ తేదీ తర్వాత మీ ఫోన్లలో గూగుల్ క్రోమ్ బంద్
-
Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్
-
Password Leak : 1600కోట్ల గూగుల్, యాపిల్ పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయట.. తస్మాత్ జాగ్రత్త
-
Mobile Apps: అన్‌ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి