Mobile Apps: అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి
Mobile Apps: అన్ఇన్స్టాల్ చేసిన యాప్‌లు కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయో లేదో ఎలా కనుగొనాలో వాటిని ఎలా నిరోధించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Mobile Apps: మన స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే యాప్‌లు.. కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, గ్యాలరీ వంటి వాటికి పర్మిషన్ అడుగుతాయి. అనుమతి ఇవ్వకపోతే ఆ యాప్‌లు పని చేయవు కాబట్టి, వాటిని ఉపయోగించడం కోసం తప్పనిసరిగా ‘అనుమతించు (Allow)’ బటన్‌పై క్లిక్ చేస్తాం. అయితే, మీరు ఒక యాప్‌కు అనుమతి ఇచ్చి, తర్వాత దాన్ని అన్ఇన్స్టాల్ చేసినా కూడా, ఆ యాప్‌లు మీ డేటాను దొంగతనంగా యాక్సెస్ చేస్తుంటాయి.
అన్ఇన్స్టాల్ చేసిన యాప్‌లు కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయో లేదో ఎలా కనుగొనాలో వాటిని ఎలా నిరోధించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. యాప్‌లు ఫోన్ నుంచి తీసివేసిన తర్వాత కూడా మీ డేటాను వదలకుండా వెంటాడుతుంటాయి. అన్ఇన్స్టాల్ చేసిన యాప్‌లు డేటా యాక్సెస్ చేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ఎలానో చూద్దాం. మీ ఫోన్ నుండి తొలగించిన యాప్‌లు కూడా మీ డేటాను దొంగిలించకుండా నిరోధించడానికి కొన్ని ఈజీ స్టెప్స్ ఉన్నాయి.
* మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి: ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి.
* ‘Google’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి : సెట్టింగ్స్‌లో ‘Google’ అని కనిపించే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* All Services పై నొక్కండి: Google సెట్టింగ్స్‌లో ‘అన్ని సేవలు’ లేదా ‘All Services’ అనే దానిపై నొక్కండి.
* ‘కనెక్టెడ్ యాప్‌లు’ (Connected Apps) పై ట్యాప్ చేయండి: ఆ తర్వాత ‘కనెక్టెడ్ యాప్‌లు’ లేదా ‘Connected Apps’ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
* లిస్ట్ చెక్ చేయాలి : ఇప్పుడు మీకు లిస్ట్ కనిపిస్తుంది. ఈ జాబితాలో మీ డేటా ఏయే యాప్‌లతో షేర్ చేయబడిందో వాటి పేర్లు ఉంటాయి. మీరు ఫోన్ నుండి తొలగించిన యాప్‌ల పేర్లు కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి.
డేటా యాక్సెస్ ఆపడం ఎలా?
ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేసిన యాప్ ఇంకా మీ డేటాను యాక్సెస్ చేస్తుంటే, దాన్ని ఆపడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
* యాప్ పేరుపై క్లిక్ చేయండి: ‘కనెక్టెడ్ యాప్‌లు’ లిస్టులో మీకు డేటాను యాక్సెస్ చేయకుండా ఆపాలనుకుంటున్న యాప్ పేరుపై క్లిక్ చేయండి.
* ‘అన్ని కనెక్షన్లను తొలగించు’ (Delete All Connections) పై నొక్కాలి. యాప్ పేరుపై ట్యాప్ చేసిన తర్వాత, ‘అన్ని కనెక్షన్లను తొలగించు’ లేదా ‘Delete All Connections’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* నిర్ధారించండి (Confirm): ఆ తర్వాత వచ్చే స్టెప్‌లో ‘నిర్ధారించు’ లేదా ‘Confirm’ బటన్‌ను నొక్కండి.
ప్రతి యాప్ కోసం ఈ ప్రాసెస్ విడివిడిగా చేయాలి. ఇలా చేయడం ద్వారా అన్ఇన్స్టాల్ చేసిన యాప్‌లు మీ పర్మీషన్ లేకుండా మీ డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధించవచ్చు. మీ ఫోన్ సేఫ్టీని కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన చిట్కా.
-
Google New Feature: గూగుల్ సెర్చింగ్‌లో ఈ కొత్త ఫీచర్ గమనించారా.. ఇక బ్రౌజర్లకు పండగే
-
Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
-
YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
-
Google Chrome : ఈ తేదీ తర్వాత మీ ఫోన్లలో గూగుల్ క్రోమ్ బంద్
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..