Password Leak : 1600కోట్ల గూగుల్, యాపిల్ పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయట.. తస్మాత్ జాగ్రత్త

Password Leak : గూగుల్, యాపిల్, ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయా? అవి ఉన్నవారికి ఓ షాకింగ్ న్యూస్. వాటికి సంబంధించిన ఏకంగా 1600 కోట్ల మంది పాస్వర్డ్లు బయటికి వచ్చేశాయట. ఇది చిన్న విషయం కాదు, ఇప్పటివరకు జరిగిన వాటిలో ఇదే పెద్ద దొంగతనం అంటున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత, అసలు మనం వాడుతున్న గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి పెద్ద కంపెనీల అకౌంట్లు నిజంగా సేఫ్‌గా ఉన్నాయా లేవా అన్న డౌట్ అందరికీ వస్తుంది.
సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 1600 కోట్ల పాస్వర్డ్లు, లాగిన్ వివరాలు అన్నీ ‘డార్క్ వెబ్’లో అమ్మకానికి పెట్టారు. ఈ పాస్వర్డ్లు పట్టుకున్న వాళ్ళు దీనికి తొందరగా అడ్డుకట్ట వేయకపోతే, ప్రజలు మోసపోవడం, వాళ్ళ గుర్తింపును దొంగలించడం, చివరికి తమ అకౌంట్లపై పట్టు కోల్పోవడం లాంటివి జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also:Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ
ఫోర్బ్స్ పత్రిక ఇచ్చిన రిపోర్టు ప్రకారం… ఈ సంవత్సరం మొదట్లో ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఈ భారీ పాస్‌వర్డ్‌ల లీక్‌కి కారణం కొన్ని రకాల మాల్వేర్లు అని తేలింది.. పాస్వర్డ్లు పోవడం చిన్న విషయం కాదు కాబట్టి, గూగుల్ కూడా కోట్లాది మంది యూజర్లకు వెంటనే మీ అకౌంట్ల పాస్వర్డ్లు మార్చుకోమని, ఇంకా పాస్‌కీలు వాడమని సూచనలు జారీ చేసింది.
సైబర్న్యూస్కి చెందిన ఓ అదికారి తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 30 దొంగిలించిన డేటాసెట్లు బయటపడ్డాయని తెలుస్తోంది. ఒక్కో దాంట్లో 3.5 బిలియన్ల (350 కోట్ల) కన్నా ఎక్కువ రికార్డులు ఉన్నాయట. అలా అన్నీ కలిపి ఆ సంఖ్య 1600 కోట్లకు చేరుకుందట. ఇందులో గూగుల్, యాపిల్, ఫేస్బుక్, టెలిగ్రామ్, గిట్‌హబ్ ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల పాస్వర్డ్లు కూడా ఉన్నాయట!
Read Also:Pizza Orders : ఓ పక్కా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం.. మరోపక్క పెంటగాన్‌లో భారీగా పెరిగిన పిజ్జా ఆర్డర్లు
మీ అకౌంట్ వివరాలు లీక్ అయ్యాయో లేదో తెలుసుకోవడం ఇప్పుడు ముఖ్యం కాదు. ఈ సమయంలో మీరు కచ్చితంగా చేయాల్సిన పనులు ఏంటంటే వెంటనే మీ అకౌంట్ల పాస్వర్డ్లు మార్చుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టడం మంచిది. పాస్వర్డ్ మార్చిన తర్వాత, మీ అకౌంట్‌కు ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ అనే ఫీచర్‌ను ఆన్ చేసుకోండి. అంటే, పాస్వర్డ్ కొట్టాక మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇది ఎక్స్ ట్రా సేఫ్టీని అందిస్తుంది. పాస్వర్డ్లు వాడే బదులు, మీ అకౌంట్ ఇంకా భద్రంగా ఉండాలంటే ‘పాస్‌కీలు’ వాడటం మంచిది. ఇది పాస్వర్డ్ లేకుండానే సురక్షితంగా లాగిన్ అయ్యే కొత్త పద్ధతి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, మీ అకౌంట్లు కొంతవరకు సేఫ్‌గా ఉంటాయి.
-
YouTube : యూట్యూబ్ రూల్స్‌లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
-
Apps : మీ పర్సనల్ డేటాను దొంగిలిస్తున్న సోషల్ మీడియా యాప్స్.. టాప్‌లో Metaవే!
-
WhatsApp : వాట్సాప్ స్పామ్ కాల్స్‌కు చెక్..మోసగాళ్ల బారిన పడకుండా ఇలా కాపాడుకోండి
-
Smartphones : వీవీఐపీలు వాడే ఫోన్లు ఏవో తెలుసా? వాటి ప్రత్యేకతలు వింటే షాకవుతారు!
-
Mobile Apps: అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి
-
iPhone 17 : ఐఫోన్ 17 ప్రో లీక్డ్ డిజైన్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!