Pizza Orders : ఓ పక్కా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం.. మరోపక్క పెంటగాన్‌లో భారీగా పెరిగిన పిజ్జా ఆర్డర్లు

Pizza Orders : ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇప్పటివరకు దాదాపు 639 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల మధ్య ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి ముందు, అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్ చుట్టూ ఉన్న రెస్టారెంట్‌లలో పిజ్జా ఆర్డర్‌లు గణనీయంగా పెరిగాయని తెలుస్తోంది. అయితే, యుద్ధం జరిగిన రోజుకు ముందు రోజు పిజ్జా ఆర్డర్‌లలో ఈ పెరుగుదల లేదు. పెంటగాన్ సమీపంలోని రెస్టారెంట్‌లలో రద్దీ పెరగడం, యుద్ధానికి సంబంధించిన ముఖ్యమైన సన్నాహాలు జరుగుతున్నాయనడానికి ఒక సూచన అని చెబుతున్నారు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.
పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ అనే ఎక్స్ అకౌంట్లో పిజ్జా దుకాణాల్లో డెలివరీలు పెరిగినట్లు చూపిస్తూ ఒక స్క్రీన్‌షాట్ షేర్ చేశారు. జూన్ 13 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దాదాపు అన్ని పెంటగాన్ పిజ్జా దుకాణాల్లో ఎక్కువ రద్దీ కనిపించిందని ఈ పోస్ట్‌లో ఉంది. అంతేకాకుండా, డొమినోస్ షాప్‌లో కూడా రాత్రి 11 గంటల ప్రాంతంలో అధిక సంఖ్యలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు.
Read Also:Yoga: ఏయే సమయాల్లో యోగా చేయకూడదో మీకు తెలుసా?
అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సమీపంలోని మూడు రెస్టారెంట్‌ల నుంచి పిజ్జా ఆర్డర్లు భారీగా పెరిగాయని చెబుతున్నారు. ఇది ప్రపంచ సంక్షోభం, భయంకరమైన యుద్ధానికి సూచనలని అంటున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు, ఇక్కడ దేశ రక్షణకు సంబంధించిన సమావేశాలు జరిగినప్పుడు సిబ్బంది పెద్ద మొత్తంలో పిజ్జా ఆర్డర్‌లు చేస్తారు.
As of 6:59pm ET nearly all pizza establishments nearby the Pentagon have experienced a HUGE surge in activity. pic.twitter.com/ZUfvQ1JBYM
— Pentagon Pizza Report (@PenPizzaReport) June 12, 2025
కాబట్టి, సైనిక దళాలు యుద్ధానికి వెళ్ళే ముందు కనిపించే ధోరణులలో ఇది ఒకటి. పిజ్జా ఆర్డర్లు ఎంత ఎక్కువగా ఉంటే, యుద్ధం మొదలయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందట. అందువల్ల, పిజ్జాలు ఎక్కువగా అమ్ముడైన సమయంలో పెంటగాన్‌లో కీలక సమావేశాలు జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. దీనికి కొన్ని గంటల తర్వాతే ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది.
Read Also:Viral Video : మనుషుల కంటే ఆవులే బెటర్.. జాతీయగీతానికి నిలబడి గౌరవించిన గోమాత
పిజ్జా ఆర్డర్ల పెరుగుదల, యుద్ధం మధ్య ఈ సంబంధం చాలా పాతది. 1990లో జరిగిన యుద్ధం సమయంలో కూడా ఇలాగే జరిగిందట. అప్పుడు అమెరికా సోవియట్ యూనియన్‌తో విభేదాలు ఉండేవి. ఆ సమయంలో వాషింగ్టన్ డిసిలో పిజ్జా డెలివరీలు హఠాత్తుగా పెరిగాయి. ఆగస్టు 1, 1990న సిఐఎ భవనానికి భారీ సంఖ్యలో పిజ్జాలను ఆర్డర్ చేశారు. దీని మరుసటి రోజు ఇరాక్ కువైట్‌పై దాడి చేసింది. 1991లో ఆపరేషన్ డెసర్ట్ స్టార్మ్ సమయంలో కూడా పిజ్జా ఆర్డర్లలో పెరుగుదల కనిపించిందని చెబుతున్నారు.