WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ పని అయిపోయినట్లేగా!
WhatsApp: మెటా వాట్సాప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ కనుక వస్తే మాత్రం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ పని అయిపోయినట్లే. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటి? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ స్టోరీలో చదవాల్సిందే.

WhatsApp : ప్రస్తుతం ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది వాట్సాప్ వాడుతున్నారు. నిజానికి చాలా ఆఫీసుల వర్క్‌లు కూడా ఇందులోనే జరుగుతాయి. అసలు వాట్సాప్ పనిచేయకపోతే మాత్రం ప్రపంచమే ఆగిపోతుంది. ఈ మెసేజింగ్ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతీ విషయాన్ని కొన్ని సెకన్లలోనే చేరవేస్తుంటారు. అయితే వినియోగదారులకు ఉపయోగపడే విధంగానే మెటా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. కొత్త కొత్త ఫీచర్లు మెటా తీసుకురావడంతో వాట్సాప్ వాడే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది. పిల్లల స్కూల్ రిపోర్ట్స్, ఆఫీస్ వర్క్ ఇలా అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఇన్‌స్టా వాడుతున్నారు. ఇందులోని రీల్స్‌కి బాగా ఎడిక్ట్ అయ్యారు. దీనికోసమే ఎక్కువగా వాడుతున్నారు. అయితే మెటా వాట్సాప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ కనుక వస్తే మాత్రం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ పని అయిపోయినట్లే. ఇంతకీ ఆ కొత్త ఫీచర్ ఏంటి? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే ఈ స్టోరీలో చదవాల్సిందే.
వాట్సాప్‌లో అన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. కానీ రీల్స్ చూసే అవకాశం అయితే లేదు. దీనివల్ల చాలా మంది యువత ఇన్‌స్టాగ్రామ్‌పై చూపించినంత మక్కువ వాట్సాప్‌పై చూపించడం లేదు. దీంతో మెటా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా రీల్స్ వస్తాయో.. వాట్సాప్‌లో కూడా రీల్స్ వచ్చే ఆప్షన్‌ను పెట్టనుంది. దీనివల్ల వాట్సాప్ వాడే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రపంచంలో నేడు రీల్స్ గొప్ప ప్రాచుర్యం సంతరించుకుంది. ఎక్కడ చూసినా కూడా వీటినే వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో మెటా వాట్సాప్‌లో కూడా రీల్స్ తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రపంచంలో మొత్తం 3.5 బిలియన్లకు పైగా ప్రజలు వాట్సాప్‌ను వాడుతున్నారు. వాయిస్, వీడియో కాల్స్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇంకా యూజర్లను ఆకర్షించేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఎక్కడా చూసినా కూడా రీల్స్ కనిపిస్తున్నాయి. చాలా మంది రీల్స్ చేస్తూ బయట కనిపిస్తున్నారు. ఇందు కోసమే మెటా వాట్సా్ప్‌లోకి రీల్స్ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకురానుంది. మీ మొబైల్‌లో ఈ ఫీచర్‌ను ఈజీగా పెట్టుకోవచ్చు. దీంతో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కాకుండా వాట్సాప్‌లోనే రీల్స్ చూడవచ్చు. అయితే మీ మొబైల్‌లో ఈ ఫీచర్‌ను యాడ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. వాట్సాప్‌లో రీల్స్ మీకు రావాలంటే ముందుగా కొన్ని అప్లికేషన్లు మార్చుకోవాలి. స్క్రీన్‌పై కనిపించే మెటా చిహ్నాం సెలక్ట్ చేసుకోవాలి. ఇందులో ఆండ్రాయిడ్, ఐఓఎస్ మెటా ఐకాన్ స్థానం డిఫరెంట్‌గా ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ, యూజర్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది. ఇందులో మీరు షో మై రీల్స్ అనే ఆప్షన్ ఎంచుకుంటే చాలు. మీకు డైలీ వాట్సాప్‌లో రీల్స్ కనిపిస్తాయి. మీకు ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లక్కర్లేదు.
-
Google Chrome : బెస్ట్ గూగుల్ క్రోమ్ ట్రిక్స్ ఇవే
-
AI : AI కి కూడా ఒత్తిడి, ఆందోళన ఉంటాయా? షాకింగ్ విషయాలు వెల్లడి.
-
Google Maps : వామ్మో గూగుల్ మ్యాప్స్ వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయా? గుడ్డిగా నమ్మవద్దా?
-
WhatsApp: అన్ని సేవలను కూడా ఒక్క వాట్సాప్ నెంబర్ తోనే.. ప్రభుత్వ ప్రైవేటు సేవలు.. ఫిర్యాదులు కూడా… ఇంతకీ ఎలా అంటే?