Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఇన్‌స్టాగ్రామ్ అయిపోయినట్లే

Whatsapp: సోషల్ మీడియా యాప్స్‌లో ప్రస్తుతం ఎక్కువగా వాట్సాప్ వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వాట్సాప్ వాడుతున్నారు. నిజానికి చాలా ఆఫీసుల వర్క్‌లు కూడా ఇందులోనే జరుగుతాయి. అసలు వాట్సాప్ పనిచేయకపోతే మాత్రం ప్రపంచమే ఆగిపోతుంది. ఈ మెసేజింగ్ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతీ విషయాన్ని కొన్ని సెకన్లలోనే చేరవేస్తుంటారు. అయితే వినియోగదారులకు ఉపయోగపడే విధంగానే మెటా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. కొత్త ఫీచర్లు మెటా తీసుకురావడంతో వాట్సాప్ వాడే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ కూడా వాడుతున్నారు. ఎందుకంటే వాట్సాప్ కంటే ఇందులో కాస్త ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కారణం. అయితే యూజర్లను పెంచేందుకు వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. మరి ఆ ఫీచర్లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
లేఔట్
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు యాప్‌లో కొత్త ఎడిటింగ్ టూల్‌ను ఉపయోగించి సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ లేఔట్ ద్వారా ఒక దాంట్లో 6 చిత్రాల వరకు యాడ్ చేసే విధంగా వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ల వల్ల ఎక్కువ ఒకే ఫ్రేమ్‌లో ఎక్కువ ఫొటోలను యాడ్ చేసుకోవచ్చు. దీని కోసం చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. వాట్సాప్‌లో ఉంటే ఇకపై దీన్నే వాడుతారు.
మ్యూజిక్
ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు స్టోరీలో ఎలా మ్యూజిక్‌ను యాడ్ చేసుకునే ఆప్షన్ ఉందో ఇటీవల వాట్సాప్‌కు కూడా ఆ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే ఇందులో మరికొన్ని ఫీచర్లను కూడా తీసుకురానుంది.
ఫోటో స్టిక్కర్లు
ఈ పర్సనల్ మెసేజింగ్ యాప్ స్టేటస్‌పై ఇన్‌స్టా్గ్రామ్‌లో స్టిక్కర్లను పెట్టవచ్చు. అయితే వీటిని ఎక్కువగా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇకపై వాట్సాప్‌లో కూడా ఇలా ఎడిట్ చేసుకునే ఆప్షన్‌ను తీసుకురానుంది. దీనివల్ల ఎక్కువ మంది వాట్సాప్‌లో గడిపే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నారు.
యాడ్ యువర్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ యువర్స్ అనే స్టిక్కర్స్ ఉన్నాయి. వీటిని చాలా మంది ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ యాడ్ యువర్స్ స్టిక్కర్లు వాట్సప్‌లోకి కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీటివల్ల యాప్ మరింత పాపులర్ అవుతుంది. ఈ ఫీచర్లు అన్ని కూడా త్వరలోనే వాట్సాప్ యాప్‌లోకి రానున్నాయి. దీనివల్ల వాట్సాప్ వాడే యూజర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు.
Related News
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్‌కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్‌లో అద్భుతమైన ఫీచర్లు
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ పని అయిపోయినట్లేగా!