Viral Video : నువ్వేం తండ్రివిరా నాయనా.. ఆ పిల్లాడిని సింహానికి ఆహారంగా వేద్దాం అనుకుంటున్నావా ?

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏ కొత్త విషయం జరిగిన క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని మంచి విషయాలు నేర్పితే, మరికొన్ని మాత్రం మన సహనాన్ని పరీక్షిస్తుంటాయి. ముఖ్యంగా, ప్రస్తుత సోషల్ మీడియాలో పాపులర్ కావాలని, నెట్టింట్లో వైరల్ అయిపోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారడానికి, ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇలాంటి వాళ్లకు ఓ ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇంటర్నెట్లో ఒక అత్యంత షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది, దీన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన పసిబిడ్డను ఒక సింహం పక్కన, దాని వీపుపై కూర్చోబెట్టి ఫోటో తీయడానికి బలవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోలో ఆ చిన్నారి భయంతో గుక్కపట్టి ఏడుస్తూ, సహాయం కోసం బిగ్గరగా అరుస్తున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది.
Read Also:Driving History: మన దేశంలో ఎడమవైపు.. విదేశాల్లో కుడివైపు డ్రైవింగ్.. దీని చరిత్ర ఏంటంటే?
@badparentingtv అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కనిపించినట్లుగా ఆ తండ్రి తన బిడ్డను సింహంపై కూర్చోబెట్టడానికి ప్రయత్నించినప్పుడు, సింహం ఒక్కసారిగా కదిలింది. అయినా కూడా ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా, కొడుకును సింహంపై కూర్చోబెట్టి ఫోటో తీయడానికి మళ్ళీ ప్రయత్నించాడు. తన కొడుకు ప్రాణాన్ని పణంగా పెట్టి ఫొటో తీయాలని ఆ తండ్రి ఉద్దేశం అని స్పష్టమవుతోంది. ఈ కలచివేసే వీడియో, ఆ తండ్రి పెంపకం తీరు మీద సోషల్ మీడియాలో తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. తన పసిబిడ్డను అంత ప్రమాదకరమైన జంతువు దగ్గరకు నెట్టడంపై నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. ఈ వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక నెటిజన్ ఏడుస్తున్న బిడ్డ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఫోటో కోసం తన కొడుకు ప్రాణాన్ని పణంగా పెట్టాడని కామెంట్ చేశారు. మామూలుగానే పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పెట్టినందుకు ఇతడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు శత్రువులంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తం మీద, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చకు దారి తీసింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also:Inspirational women: చీరతో వందల మంది ప్రాణాలను కాపాడిన ఓ మహిళ.. ఇంతకీ ఆమె ఎవరంటే?
-
Instagram New Feature: ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్ విడుదల
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం