AI blackmails developer: నీ రిలేషన్స్ అన్ని బయట పెడతా.. డెవలపర్‌కి ఏఐ బ్లాక్ మెయిల్
AI blackmails developer: భవిష్యత్తులో కూడా ఈ ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోతాయని అంటుంటారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు ఇంకా ఎక్కువగా తగ్గుతాయని చెబుతుంటారు. అయితే ఏఐని అప్‌డేట్ చేస్తుంటారు.

AI blackmails developer: సాంకేతిక రంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ఏ చిన్న విషయం డౌట్ వచ్చిన కూడా వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అడుగుతారు. నిజానికి చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెటలిజెన్స్‌ను అన్నింటికి ఉపయోగిస్తారు. కొందరికి వర్క్ రాకపోతే అన్ని డౌట్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అడిగి వర్క్ చేస్తుంటారు. కొన్నిసార్లు అంతా కూడా కరెక్ట్‌గానే చెబుతుంది. మరికొన్ని సార్లు మాత్రం సరిగ్గా చెప్పదు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల చాలా మందికి ఏం రాకపోయినా కూడా సరిగ్గా చేస్తుంటారు. భవిష్యత్తులో కూడా ఈ ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోతాయని అంటుంటారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాలు ఇంకా ఎక్కువగా తగ్గుతాయని చెబుతుంటారు. అయితే ఏఐని అప్‌డేట్ చేస్తుంటారు. దీనివల్ల కొత్త వెర్షన్ వస్తుంది. అయితే ఇలా కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేయవద్దని ఇంజనీర్‌కు ఏఐ బ్లాక్ మెయిల్ చేసింది.
Also Read: Conductor Jobs Recruitment 2025: పదో తరగతి చదివితే చాలు.. కండక్టర్ ఉద్యోగం మీకే
ఏఐని సృష్టించిన వారికే బెదిరింపులు చేస్తోంది. ఓ ఏఐ మోడల్ తన ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. తనని పక్కన పెట్టి సరికొత్త వెర్షన్‌ను అప్డేట్ చేస్తే మీ సీక్రెట్స్, అక్రమ సంబంధాలు అన్ని విషయాలు కూడా చెప్పేస్తానని ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ క్లాడ్ ఒపస్ 4 అనే ఏఐ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఈ ఏఐ మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడుతుంది. అన్ని పనులు కూడా చేస్తుంది. డాక్యుమెంట్లు చదవడం, రాయడం, కోడింగ్ ఇలా అన్ని రకాల మోడల్స్ కూడా చేస్తుంది. అయితే ఈ ఏఐని డెవలపర్‌లు ఇటీవల మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. దీనికి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఏఐ చేసిన వ్యాఖ్యలు అందరినీ కూడా ఆశ్చర్య పరుస్తుంది. ఏఐ మాట్లాడటంతో భవిష్యత్తులో ఆధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేస్తామని చెప్పడంతో.. ఇంజినీర్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. భవిష్యత్తులో దీన్ని అప్‌డేట్ చేస్తే మాత్రం నీ అక్రమ సంబంధం విషయాన్ని బయట పెడతానని హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా డెవలపర్ షాక్ అయ్యాడు.
Also Read: Viral Video : కుక్కను ముద్దు చేసిన యజమాని.. అసూయతో గాడిద ఏం చేసిందో తెలుసా ?
క్లాడ్ ఒపస్ 4 ఈ విషయాన్ని ఎలా గుర్తు పట్టిందని నిపుణులు ఆలోచిస్తున్నారు. డెవలపర్ తన విషయాలు అన్నింటిని కూడా కంప్యూటర్ లేదా ఆన్‌లైన్‌లో దాచుకోవడం వల్ల ఏఐ దాన్ని గుర్తించవచ్చని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఏఐ వల్ల ప్రమాదాలు ఉందని చాలా మంది హెచ్చరిస్తున్నారు. ఇంతలో ఈ పరిణామం జరగడంతో ఇంకా భయపడుతున్నారు. ఏఐ వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని అర్థం అవుతుంది. మనుషులను ఇకపై యంత్రాలు శాసించే రోజులు ఇంకా ఎన్ని రోజులు లేదని తెలుస్తోంది. మనుషులు సీక్రెట్స్ అన్ని కూడా ఏఐ తెలుసుకుని లీక్ చేస్తే ఇలా కష్టమని అంటున్నారు.
-
AI Videos: అమ్మాయిలతో ఏంట్రా ఈ పనులు?
-
Google Chrome : ఈ తేదీ తర్వాత మీ ఫోన్లలో గూగుల్ క్రోమ్ బంద్
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..