Conductor Jobs Recruitment 2025: పదో తరగతి చదివితే చాలు.. కండక్టర్ ఉద్యోగం మీకే
Conductor Jobs Recruitment 2025: కండక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. అలాగే చదువు పదో తరగతి చదివి ఉంటే సరిపోతుంది. అయితే ఈ కండక్టర్ పోస్టులకు వీటితో పాటు మరికొన్ని రూల్స్ కూడా పాటించాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Conductor Jobs Recruitment 2025: ఏదైనా ఒక చిన్న ఉద్యోగం కావాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులుగా ఎందరో ఉంటున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదైనా ఒక ఉద్యోగం చాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ కొరత ఏర్పడింది. దీంతో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో అయిన కండక్టర్లను నియమించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దీనికోసం సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే ఈ కండక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరికి అయితే జాబ్ ముఖ్యమో వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కండక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. అలాగే చదువు పదో తరగతి చదివి ఉంటే సరిపోతుంది. అయితే ఈ కండక్టర్ పోస్టులకు వీటితో పాటు మరికొన్ని రూల్స్ కూడా పాటించాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: Viral Video : కుక్కను ముద్దు చేసిన యజమాని.. అసూయతో గాడిద ఏం చేసిందో తెలుసా ?
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్లుగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేరాలంటే వారు ఏజెన్సీకి రూ.2 లక్షలు కట్టాలి. అంటే ఇది సెక్యూరిటీ డిపాజిట్. విధులు నిర్వరిస్తున్న సమయంలో సంస్థకు ఏదైనా జరిగితే మాత్రం సెక్యూరిటీ డిపాజిట్ ద్వారా దాన్ని రికవరీ చేయనున్నారు. అయితే వీరికి నెలకి రూ.17,969 జీతం ఇవ్వనున్నారు. అయితే వీరికి వర్క్‌మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ వర్తించదని తెలిపారు. అలాగే పీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి కూడా ఉండవని స్పష్టం చేశారు. అయితే ఈ కండకర్లుగా ఎవరైతే ఎంపిక అవుతారో వారికి వారం రోజుల పాటు శిక్షణ ఉంటుంది. టీజీఎస్ ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో మూడు రోజులు ప్రో కండక్టర్‌గా శిక్షణ ఇస్తారు. దీంతో పాటు శిక్షణ సమయంలో వసతి, భోజనం కూడా కల్పిస్తారు. అలాగే వీరికి మెడికల్ ఎగ్జామినేషన్ కూ చేస్తారు. అయితే కండక్టర్లుగా ఎంపికైన వారికి కాంట్రాక్టర్లుగా లైసెన్స్ కూడా ఇస్తారు. అయితే వీటిని సంస్థ ఉచితంగా ఇస్తుంది.
Also Read: Car Protection Tips : కారులో ఎలుకల బెడద.. 3 సింపుల్ చిట్కాలతో ఇక అంతా క్లియర్!
ఈ కండక్టర్ విధుల్లోకి చేరడానికి ముందు ఒరిజినల్ టెన్త్ మెమోను సంస్థకు ఇవ్వాలి. అయితే ఈ కండక్టర్లకు రెగ్యులర్ కండక్టర్లలాగానే ఇన్సెంటివ్స్, ఎర్నింగ్స్ క్యాష్ రూపంలో కూడా ఇస్తారు. కాకపోతే డబుల్ డ్యూటీకి అవకాశం లేదు. అయితే ఇందులో ఓవర్ నైట్ డ్యూటీలు కూడా వేసే అవకాశం ఉంది. అయితే ఓటీలో గంటకు రూ.100 ఇస్తారు. అయితే ఈ ఔట్ సోర్సింగ్‌లో కండక్టర్లకు కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే డ్యూటీ వేస్తారు. అయితే విధులు నిర్వర్తించే సమయంలో టీఐఎం మిషన్ ఏమాత్రం దెబ్బ తింటే డిపాజిట్ చేసిన రూ.2 లక్షల నుంచి డబ్బులు కట్ చేసుకుంటారు. అలాగే వర్క్ చేసే ప్లే్స్ నుంచి 35 కిలోమీటర్ల లోపు ఉంటేనే బస్ పాస్ ఇస్తారు. లేకపోతే ఇవ్వరు. అలాగే వీరికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుంది.
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
-
Kerala Tour Just 14000: కేరళ టూర్ జస్ట్ 14000.. ఎంజాయ్ చేయడానికి త్వరపడండి