Viral Video : కుక్కను ముద్దు చేసిన యజమాని.. అసూయతో గాడిద ఏం చేసిందో తెలుసా ?

Viral Video : సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి మన మూడ్‌ని అమాంతం మార్చేస్తాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మనం మనుషులమే కాదు, జంతువులు కూడా అసూయపడతాయని మనకు అర్థం అవుతుంది. అవును, అచ్చం మనుషుల్లాగే అవి కూడా తోటి జంతువులపై యజమాని ప్రేమను చూసి చిన్నబుచ్చుకుంటాయి.
ఈ ప్రపంచంలో మనుషులైనా, జంతువులైనా, ప్రతి ఒక్కరూ ప్రేమను కోరుకుంటారు. ప్రతి జీవికి తనను ప్రేమించే, శ్రద్ధ వహించే ఒకరు కావాల్సిందే. ముఖ్యంగా జంతువుల విషయానికి వస్తే, అవి తమ యజమానుల నుంచి అంతులేని ప్రేమను ఆశిస్తాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక గాడిద తన యజమాని తన మీద కాకుండా కుక్క మీద ప్రేమను కురిపిస్తున్నందుకు ఎలా అసూయపడిందో చూపిస్తుంది.
Read Also:Car Protection Tips : కారులో ఎలుకల బెడద.. 3 సింపుల్ చిట్కాలతో ఇక అంతా క్లియర్!
Donkey wants some love too pic.twitter.com/qPTt960llO
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 23, 2025
ఆ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన కుక్కను ఒడిలో పెట్టుకుని నిమురుతూ, ముద్దులు పెడుతూ ప్రేమను చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి చేసిన ఈ చర్యను చూసిన ఒక గాడిదకు అసూయ మొదలైంది. మొదట్లో అది ఏమీ చేయకుండానే చూసింది. కానీ, యజమాని ప్రేమ కుక్కపై ఎక్కువైనప్పుడు ఆ గాడిదకు కోపం వచ్చిందో ఏమో, అది ఒక్కసారిగా వెళ్లి తన యజమాని ఒడిలో కూర్చుండిపోయింది. తన పెంపుడు గాడిద చేసిన ఈ సరదా పనిని చూసిన తర్వాత ఆ వ్యక్తి నవ్వడం ఆపలేకపోయాడు. వెంటనే గాడిదను కూడా ముద్దు చేస్తూ లాలించడం ప్రారంభించాడు.
ఈ వీడియోను @AMAZlNGNATURE అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇది వేలాది మందిని ఆకట్టుకొని, లక్షలాది వ్యూస్‌ను సాధించింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ “జంతువులు నిజంగా ప్రేమ కోసం పరితపిస్తుంటాయి” అని రాస్తే, మరొకరు “ఈ వీడియో నా రోజును ఆనందంగా మార్చింది” అని కామెంట్ చేశారు. జంతువుల్లోని ఈ అమాయకత్వం, ప్రేమను కోరుకునే స్వభావం అందరినీ ఆకట్టుకుంటోంది.
Read Also:Instagram : బంధాలను బలోపేతం చేసే ఇన్స్టాగ్రామ్ ఫీచర్.. బ్లెండ్ గురించి పూర్తి వివరాలివే!
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు