Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Uncategorized News »
  • Instagrams New Blend Feature Share A Unified Content Feed With Your Partner

Instagram : బంధాలను బలోపేతం చేసే ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్.. బ్లెండ్ గురించి పూర్తి వివరాలివే!

Instagram : బంధాలను బలోపేతం చేసే ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్.. బ్లెండ్ గురించి పూర్తి వివరాలివే!
  • Edited By: rocky,
  • Updated on May 25, 2025 / 09:03 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Instagram : తమ యూజర్లకు మంచి అనుభవాన్ని అందించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త, ప్రత్యేకమైన ఫీచర్‌ను పరిచయం చేసింది. దాని పేరే ‘బ్లెండ్’ (Blend). ఈ ఫీచర్ ముఖ్యంగా తమ పార్ట్‌నర్‌, బెస్ట్ ఫ్రెండ్, లేదా ఎవరైనా సన్నిహితులతో తమ సోషల్ మీడియా అనుభవాన్ని పంచుకోవాలనుకునే వారి కోసం రూపొందించారు. ఈ బ్లెండ్ ఫీచర్ ఏమిటి.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.

ఏంటి ఈ ‘బ్లెండ్’ ఫీచర్?
బ్లెండ్ ఫీచర్ సహాయంతో మీరు, మీ పార్ట్‌నర్ ఇద్దరూ ఒకే రకమైన కంటెంట్‌ను మీ ఫీడ్‌లో చూడవచ్చు. దీని అర్థం ఏమిటంటే.. ఇన్ ‌స్టాగ్రామ్‌లో మీకు నచ్చిన రీల్స్, పోస్ట్‌లు, కంటెంట్, అలాగే మీ స్నేహితుడికి నచ్చిన కంటెంట్, ఈ రెండింటినీ కలిపి ఒకే ఫీడ్‌లో మీకు కనిపిస్తాయి. దీనిలో మంచి విషయం ఏమిటంటే.. ఈ మిక్స్డ్ ఫీడ్‌ను మీరు, మీ పార్ట్‌నర్ మాత్రమే చూడగలరు. మరెవరూ చూడలేరు.

Read Also:Vitamin D : విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా?.. ఎముకలకు మేలు చేసే 4 శాకాహార ఆహారాలివే !

బ్లెండ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. మీరు ఎవరినైనా బ్లెండ్‌లోకి ఆహ్వానించవచ్చు. అది మీ పార్ట్‌నర్ కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, అక్క-చెల్లెళ్లు, అన్నదమ్ములు, లేదా మీ దగ్గరి బంధువులు కావచ్చు. మీరు ఎవరినైనా బ్లెండ్‌లోకి ఇన్వైట్ చేసినప్పుడు వారికి ఒక మెసేజ్ వెళ్తుంది. వారు మీ ఇన్వైట్ ను అంగీకరించగానే, ఇన్‌స్టాగ్రామ్ మీ ఇద్దరి ఇష్టమైన కంటెంట్‌ను కలిపి ఒక ప్రత్యేకమైన ఫీడ్‌ను తయారు చేస్తుంది.ఈ ఫీడ్ మీకు DMs (డైరెక్ట్ మెసేజెస్) విభాగంలో కనిపిస్తుంది. ఇందులో మీ అభిరుచులు, మీ పార్ట్‌నర్ అభిరుచులు రెండింటి కలయిక కనిపిస్తుంది.

బ్లెండ్ వల్ల యూజర్లకు కలిగే లాభాలు 
ఈ బ్లెండ్ ఫీచర్ వల్ల యూజర్లకు చాలా ప్రయోజనాలున్నాయి. ఇకపై మీరు, మీ పార్ట్‌నర్ ఇద్దరూ ఒకే రకమైన సరదా లేదా ట్రెండింగ్ కంటెంట్‌ను చూడగలుగుతారు.ఒక పోస్ట్‌ను మరొకరికి పంపించాల్సిన అవసరం లేదు. మీరిద్దరికీ ఆ పోస్ట్ ముందుగానే కనిపిస్తుంది. దీనివల్ల చర్చలు, అభిప్రాయాలు పంచుకోవడం సులభతరం అవుతుంది.మీ పార్ట్‌నర్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడం మరింత ప్రత్యేకంగా మారుతుంది. మీ ఇద్దరి ఇంట్రెస్టులు పంచుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. బ్లెండ్ ఫీచర్ మీకు, మీరు ఇన్వైట్ చేసిన ఆ ప్రత్యేక వ్యక్తికి మాత్రమే కంటెంట్‌ను చూపిస్తుంది.

Read Also:MS Dhoni: ధోనీకి చివరి మ్యాచ్ ఈ రోజేనా!

బ్లెండ్ ఫీచర్ ప్రైవేటా?
ఈ బ్లెండ్ ఫీచర్ పూర్తిగా ప్రైవేట్. మీ, మీ పార్ట్‌నర్ బ్లెండ్ ఫీడ్‌ను మరెవరూ చూడలేరు. ఇది పూర్తిగా వ్యక్తిగతం, ప్రైవసీతో కూడిన అనుభవాన్ని అందిస్తుంది.

Tag

  • Couple's Feature
  • Friendship Feature
  • Instagram Blend Feature
  • Shared Feed
  • Social Media Features
Related News
    Latest Photo Gallery
    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

    • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

    • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

    • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

    • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

    • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

    • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us