Ajith Kumar : ఎంతో స్టైలిష్ గా ఉండే హీరో అజిత్ కుమార్ ఏంటి ఇలా అయిపోయాడు

Ajith Kumar : ఎంతో స్టైలిష్ గా ఉండే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఊహించని విధంగా చాలా మారిపోయారు. ఆయన తన ఫిట్‌నెస్ పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. బరువును గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా ఇప్పుడు కొత్త లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇంతకు ముందు చూసిన అజిత్ కుమారేనా? అని అనుమానం వచ్చేలా ఆయన ఉన్నారు. ప్రస్తుతం అజిత్ కుమార్ కొత్త లుక్ వైరల్ అవుతోంది. ఆయన జుట్టును ట్రిమ్ చేసుకుని, చాలా స్లిమ్‌గా కనిపించారు. ఇది ఆయన తదుపరి సినిమా కోసమే అయ్యుండొచ్చని నెటిజన్లు ఊహిస్తున్నారు.
బెల్జియంలో కొత్త గెటప్‌లో అజిత్
అజిత్ కుమార్‌కు సినిమాలతో పాటు కార్ రేసింగ్ అంటే పిచ్చి. దాని కోసమే ఆయన రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. త్వరలో జరగబోయే రేస్ కోసం ఆయన చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బెల్జియంలో ఉన్నారు. అక్కడే ఈ కొత్త గెటప్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.
Read Also : EPFO: ఈపీఎఫ్‌ఓలకు గుడ్ న్యూస్.. ఆటో సెటిల్‌మెంట్‌కు రూ.5 లక్షలు
ఇంతకుముందు కొంచెం బొద్దుగా కనిపించిన అజిత్, ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారారు. పైగా, హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నారు. 2025లో అజిత్ నటించిన విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు విడుదలయ్యాయి. ఆయన తదుపరి సినిమా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
రూ.275 కోట్ల సినిమా కోసమేనా ఈ లుక్?
దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్ కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమా బడ్జెట్ దాదాపు రూ.275 కోట్లు అని చెబుతున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా కోసమే అజిత్ కుమార్ ఈ కొత్త గెటప్ ధరించారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అజిత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కార్ రేసింగ్‌పైనే ఉంది.
Read Also : Railway: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. పెరగనున్న టికెట్ ధరలు
అజిత్ కుమార్‌కు కార్లంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు కార్ రేసింగ్‌లో మంచి అనుభవం ఉంది. ఇటీవల ఆయన ఒక ఖరీదైన రేస్ కారును కూడా కొనుగోలు చేశారు. మెక్ లారెన్ సెన్నా అనే ఈ కారు ధర ఏకంగా రూ.6.75 కోట్లు అని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ కారుతో అజిత్ నిలబడిన ఫోటో కూడా వైరల్ అయ్యింది. గతంలో ఆయన కార్ ప్రమాదాలకు గురైనప్పటికీ, కార్ రేసింగ్‌పై ఆయన ఎఫెక్షన్ మాత్రం తగ్గలేదు.