Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా, ముఖ్యంగా రీల్స్ అనేది చాలా మంది జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఏదో ఒక వీడియో తీస్తూనే ఉన్నారు. తమ వీడియోలు వైరల్ కావాలని, లైక్స్, వ్యూస్ లక్షల్లో రావాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు చేస్తుంటే, మరికొందరు వింతైన పనులు చేసి నవ్వులపాలు అవుతున్నారు. ఇలాంటిదే ఒక సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షం వచ్చిన ఆనందంలో రీల్ చేయబోయిన ఒక యువతి అడ్డంగా బుక్కై నవ్వులపాలైంది.
papakiparimampi అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో ఒక యువతి రీల్స్ చేయాలని ఆశపడి, ఒక పెద్ద తప్పు చేసింది. బయట వర్షం పడి వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆనందంలో పెరట్లో అంతా తడిసిపోయి ఉన్నా పర్వాలేదు అనుకుని రీల్ చేయాలని డిసైడ్ అయ్యింది.
Read Also:TVS NTorq 125 : యాక్టీవాకు షాక్.. రూ.85వేలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమ్మకాల్లో రికార్డ్
View this post on Instagram
వీడియోలో ఎరుపు రంగు చీర కట్టుకున్న ఒక యువతి కనిపిస్తుంది. ఆమె తన పెరట్లోకి ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. తన అభిమాన పాటకు డ్యాన్స్ స్టెప్పులు వేయడానికి సిద్ధమవుతుంది. మొదటి అడుగు వేయగానే తడిసి ఉన్న నేల మీద కాలు జారింది. ఆమె కంట్రోల్ కోల్పోయి, ఒక్కసారిగా కింద బోర్లా పడిపోయింది. ఈ దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె డ్యాన్స్ చేయడానికి వెళ్లడం, కాలు జారడం, కింద పడిపోవడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి.
ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి, లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి చేసిన పనికి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లతో నింపేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ వీడియో చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు అని రాశారు. ఈ సంఘటనరీల్స్ మోజులో హద్దులు దాటితే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియజేస్తుంది.
Read Also:Allu Arjun : రణ్ వీర్ కు షాక్.. శక్తిమాన్ గా రాబోతున్న అల్లు అర్జున్ ?
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం