Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికీ లైక్స్, వ్యూస్ పిచ్చి పట్టుకుంది. తమ వీడియోలు వైరల్ అవ్వాలని ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ వ్యామోహంలో ప్రజలు ఎంతగా చిక్కుకుపోయారంటే వీళ్లకు ఏది మంచి ఏది చెడు అనేది కూడా గుర్తించలేకపోతున్నారు. ఫేమస్ అవ్వడం కోసం ప్రమాదాలను కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు. అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక మహిళ రీల్ చేయడానికి ఎంతకు సాహసించిందో చూస్తే ఎవరూ ఊహించి కూడా ఉండరు. అయితే ఆమె చేసిన పని వల్ల వీడియో వైరల్ అయినా, ప్రజలు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఎవరి వీడియో అయినా లైక్స్, వ్యూస్ కావాలంటే, దానికి అత్యంత సులువుగా పనిచేసే మార్గం డాన్స్ వీడియో చేయడం. అయితే, కొందరు కొంచెం డిఫరెంట్‌గా, విచిత్రంగా చేయాలనుకుని మరీ వింతగా ప్రవర్తిస్తారు. అలాంటి వాటిని చూస్తే ఆశ్చర్యమే కాదు లైక్స్, వ్యూస్ కోసం ఇంత పిచ్చా? అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక మహిళ తాను డిఫరెంట్‌గా కనిపించడం కోసం కప్పల సహాయంతో వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టింది.
Read Also:Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!
వీడియోలో ఒక తన మెడలో కప్పలను ఒక హారంలా వేసుకుని ఉంది. అంతేకాదు, ఆమె తన తల మీద కూడా ఒక కప్పను పెట్టుకుని ఉంది. ఆ మహిళ కప్పలతోనే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె డ్యాన్స్ అంత బాగా లేకపోయినా, ఆ మహిళ చేసిన ఈ విచిత్రమైన పని వల్ల వీడియో బాగా వైరల్ అయింది. ప్రజలు దీన్ని కేవలం చూడటమే కాదు విపరీతంగా షేర్ కూడా చేస్తున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @soo_funny_memes అనే అకౌంట్ షేర్ చేసింది. దీన్ని వేల మంది లైక్ చేయగా, లక్షల మంది చూశారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్.. ప్రజలు లైక్స్, వ్యూస్ కోసం పిచ్చివాళ్లయ్యారు అని రాశారు.మరొకరు.. ఇలాంటి డ్యాన్స్ వల్ల మొత్తం కప్పల సమాజం భయపడిపోయి ఉంటుంది అని అన్నారు.
Read Also:Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం