WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
ప్రస్తుతం ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది వాట్సాప్ వాడుతున్నారు.

WhatsApp: ప్రస్తుతం ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది వాట్సాప్ వాడుతున్నారు. నిజానికి చాలా ఆఫీసుల వర్క్‌లు కూడా ఇందులోనే జరుగుతాయి. అసలు వాట్సాప్ పనిచేయకపోతే మాత్రం ప్రపంచమే ఆగిపోతుంది. ఈ మెసేజింగ్ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతీ విషయాన్ని కొన్ని సెకన్లలోనే చేరవేస్తుంటారు. అయితే వినియోగదారులకు ఉపయోగపడే విధంగానే మెటా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. కొత్త కొత్త ఫీచర్లు మెటా తీసుకురావడంతో వాట్సాప్ వాడే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది. పిల్లల స్కూల్ రిపోర్ట్స్, ఆఫీస్ వర్క్ ఇలా అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. అయితే వాట్సాప్ యూజర్లకు మెటా ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్‌ను వాడే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ఎయిర్ ఫ్రైయర్‌తో వంట చేశారా.. మీరు ప్రమాదంలో పడినట్లే
మెటా వాట్సాప్ వాయిస్ చాట్ అనే కొత్త గ్రూప్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు రియల్ టైమ్ ఆడియో సంభాషణలు ఈజీగా చేసుకోవచ్చు. వినియోగదారులు గ్రూప్ కాల్ చేయకుండానే సెలక్ట్ చేసుకున్న సభ్యులతో లైవ్ ఆడియో సంభాషణలు చేయవచ్చు. ఎప్పటికప్పుడు యూజర్లు గ్రూప్‌లో లైవ్ కనెక్ట్ కావచ్చు. ఇష్టమైన వాటిని షేర్ చేసుకోవడానికి, ఇష్టమైన సినిమాలు, షోలు ఇలా అన్నింటి గురించి మాట్లాడుకోవచ్చు. ఈ వాయిస్ చాట్‌కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇందులో ప్రత్యేకంగా ఎవరికీ కూడా రింగ్ వెళ్లదు. ఈ గ్రూప్‌లో ఉన్న వారు ఎప్పుడైనా కూడా వాయిస్ చాట్ లో చేరవచ్చు. నచ్చలేదంటే వెంటనే వెళ్లిపోవచ్చు. అయితే ఈ వాయిస్ చాట్ ఫీచర్‌ను మీ మొబైల్‌లో యాక్టివేట్ చేసుకోవాలంటే ఏదైనా గ్రూప్ ఓపెన్ చేసి, కింది నుంచి పైకి స్వైప్ చేయాలి. ఆ తర్వాత కొంత సమయం స్వైప్‌ను హోల్డ్ చేసుకుంటే.. వాయిస్ చాట్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల సాధారణ గ్రూప్ కాల్స్ మాదిరిగా ప్రతీ సభ్యుడికి కూడా రింగ్ వెళ్లదు. ఇది యాక్టివేట్ అయిన తర్వాత, చాట్ దిగువన ఉంటుంది. దీంతో ఎప్పడైనా కూడా గ్రూపు సభ్యులు అందులో చేరవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ చాట్స్‌కి ఉన్నట్లే దీనికి కూడా ఉంటుంది. దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. యూజర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
-
Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?
-
Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?
-
Anchor Anasuya: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ
-
Electricity Bill: కరెంట్ బిల్ తక్కువగా రావాలా.. ఈ ఫ్యాన్‌లు వాడండి
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్‌లో అద్భుతమైన ఫీచర్లు
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి