Skyrider X6: వచ్చేస్తున్న ఎగిరే బైక్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Skyrider X6: కొందరికి విమానాల్లో ప్రయాణించాలని ఎంతో ఆశగా ఉంటుంది. అయితే ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఎగిరే కార్లు వస్తున్నాయని వార్తలు విన్నాం. కానీ ప్రస్తుతం మార్కెట్‌లోకి ఎగిరే బైక్‌లు వస్తున్నాయి. వీటిని చైనీస్ టెక్ కంపెనీ క్విక్‌వీల్ తీసుకొచ్చింది. స్కైరైడర్ X6 అనే పేరుతో ఎగిరే బైక్‌ను తెచ్చింది. అయితే ఇవి కేవలం భూమిపై మాత్రమే కాకుండా, గాలిలో కూడాఎగురుతాయి. చాలా మందికి భూమిపై కంటే ఎగిరే వాహనాలు అంటే చాలా ఇష్టం. దీంతో ఎగిరే వాటిని ఎంచుకుంటారు. అయితే ఈ ఎగిరే బైక్ మార్కెట్ లోకి రావడం వల్ల బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది వీటిపై ఉన్న ఇష్టంతో వాడుతారు. అయితే ఈ ఎగిరే బైక్ మూడు చక్రాలతోనే ఉంటుంది. నేలపై వెళ్లడంతో పాటు గాలిలో కూడా ఎగరగలదు. అయితే ఈ ఎగిరే బైక్ నేలపై గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. అయితే ఎగిరేటప్పుడు 6-యాక్సిస్, 6-రోటర్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దీనికి 10.5 kWh పవర్ బ్యాటరీ ఉంది. దీనివల్ల ఛార్జింగ్ పెట్టిన గంటకే ఫుల్ అవుతుంది.
స్కైరైడర్ X6లో బెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో అన్నింటి కంటే గొప్ప ఫీచర్ డ్యూయల్ మోడ్ కాన్ఫిగరేషన్. దీనివల్ల ట్రాఫిక్ లేనప్పుడు ఈ ఎగిరే బైక్‌ను నేలపై నడుపుకోవచ్చు. అదే ట్రాఫిక్ ఉంటే మాత్రం గాలిలో నడుపుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవు. అయితే గాలిలో నడిపేందుకు రైడర్.. ట్రాఫిక్ పోలీసులు, పౌర విమానయాన శాఖ అధికారుల పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే ఈ ఎగిరే బైక్‌లను నడపలేరు. ఈ బైక్ ఖరీదు 4,98,800 యువాన్లు ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ.59.74 లక్షలు. అయితే ఈ ఎగిరే బైక్ ప్రీ-బుకింగ్ చైనాలో ప్రారంభమైంది. ఫ్లయింగ్ మోడ్‌లో 6 అక్షాలు, 6 రోటర్‌లు ఉంటాయి. ఫ్లయింగ్ కోసం, ఇది జాయ్‌స్టిక్ ఆధారిత ఆపరేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అందువల్ల దీన్ని గాలిలో నడపడం చాలా తేలిక అంటున్నారు. దీని నిర్మాణంలో కార్బన్ ఫైబర్ మిశ్రమాలు, ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం ఉపయోగించారు. అందువల్ల ఇది తేలికగా, బలంగా ఉంటుంది. ఇందులో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆటో టేకాఫ్, ఆటో ల్యాండింగ్, రూట్ ప్లానింగ్, క్రూయిజింగ్ వంటి ఆటోమేటెడ్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి.
Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్
-
China danger virus: చైనాలో మరో కొత్త డేంజర్ వైరస్.. సోకితే ప్రాణాలకే ప్రమాదం
-
Rare Earth Elements : చైనాకు ఝలక్ ఇవ్వబోతున్న టాటా మోటార్స్.. రేర్ ఎర్త్ విషయంలో ‘డ్రాగన్’ ప్లాన్ ఫెయిల్!
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
AI Hospital : ప్రపంచపు మొట్టమొదటి AI ఆస్పత్రిని ప్రారంభించిన చైనా.. డాక్టర్లంతా రోబోలే
-
Pig Liver To Human: వైద్యశాస్త్రంలో మరో అద్భుతం.. మానవునికి పంది కాలేయం