Karakoram Highway : ప్రపంచంలోనే ఎత్తైన రహదారి.. ప్రకృతి అందాలకు, సాహస యాత్రకు అడ్డా.. ఎక్కడ ఉందంటే ?

Karakoram Highway : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంతర్జాతీయ రహదారిగా పేరుగాంచిన కరాకోరం హైవే పాకిస్తాన్, చైనాలను కలుపుతుంది. దీనిని ఫ్రెండ్షిప్ హైవే అని కూడా పిలుస్తారు. సుమారు 1,300 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ అద్భుతమైన రహదారి, హిందూకుష్, కరాకోరం, హిమాలయ పర్వత శ్రేణుల మధ్య సాగుతుంది. ఈ రహదారి కేవలం ప్రయాణ మార్గం మాత్రమే కాదు.. ప్రకృతి అందాలకు, సాహసాన్ని, చరిత్రను, సంస్కృతిని తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఓ మంచి అనుభూతిని అందిస్తుంది.
కరాకోరం హైవే నిర్మాణం 1966లో మొదలై 1979 వరకు కొనసాగింది. ఈ ప్రాజెక్ట్‌లో పాకిస్తాన్, చైనాకు చెందిన ఇంజనీర్లు, కార్మికులు కలిసి పనిచేశారు. ఈ హైవే చరిత్రలో ప్రసిద్ధి గాంచిన సిల్క్ రోడ్లో ఒక భాగం. దీని నిర్మాణం అంత ఈజీ కాదు. నదులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయల గుండా దీనిని నిర్మించారు. ఇది ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా చెప్పొచ్చు.ఈ రహదారి నిర్మాణం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇతర సంబంధాలు మరింత బలపడ్డాయి.
Read Also:With out pay slips personal Loan: పే స్లిప్స్ లేకపోతే పర్సనల్ లోన్ రాదా?
ఈ రహదారిపై ప్రయాణం చేసేవారికి ఎన్నో టూరిజం ప్లేసులు కనిపిస్తాయి. ముందుగా ఖుంజెరాబ్ పాస్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు క్రాసింగ్. ఇక్కడ మంచుతో కప్పబడిన కొండలు, స్వచ్ఛమైన గాలి పర్యాటకులను అబ్బురపరుస్తాయి. ఈ మార్గంలో వచ్చే హున్జా లోయ తన అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, పచ్చటి దృశ్యాలకు, ఎత్తైన పర్వతాలకు పేరుగాంచింది. అట్టాబాద్ సరస్స పర్వతాల మధ్య నీలం రంగులో మెరిసిపోతుంది. ఈ సరస్సు కరాకోరం హైవేలోని ఒక ముఖ్యమైన ఆకర్షణ. బోటింగ్, ప్రకృతి అందాలను చూడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.
ఈ రహదారి వెంట ప్రయాణిస్తున్నప్పుడు పర్వతాల గుండా వెళ్ళే నదులు, లోతైన లోయలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ఆకుపచ్చని పచ్చిక బయళ్లు అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. ప్రతి మలుపులోనూ ప్రకృతి కొత్త అందాలను ఆవిష్కరిస్తుంది. కరాకోరం హైవే కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు. ఇది సాహసయాత్ర చేసే వారికి, ప్రకృతిని ప్రేమించే వారికి, చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి ఒక స్వర్గం లాంటిది. ఇక్కడ బైక్ రైడింగ్, హైకింగ్ వంటి సాహస క్రీడలు కూడా చేయవచ్చు. ఈ హైవే, పాకిస్తాన్, చైనాల మధ్య కేవలం భౌగోళిక సంబంధాన్ని మాత్రమే కాకుండా, సాంస్కృతిక, చారిత్రక బంధాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ రహదారిలో ప్రయాణించడం జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు.
Read Also:Pavan Kalyan: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో చూశారా?
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
China danger virus: చైనాలో మరో కొత్త డేంజర్ వైరస్.. సోకితే ప్రాణాలకే ప్రమాదం
-
Skyrider X6: వచ్చేస్తున్న ఎగిరే బైక్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!