China danger virus: చైనాలో మరో కొత్త డేంజర్ వైరస్.. సోకితే ప్రాణాలకే ప్రమాదం

China danger virus: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఎందరో ప్రాణాలను బలిగొంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ వల్ల యావత్తు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కోవిడ్ వల్ల ఎందరో వారికి కావాల్సిన వారిని కోల్పోయారు. చైనాలో ల్యాబ్‌లోనే ఈ వైరస్ పుట్టిందని, దీన్ని ప్రపంచమంతా కూడా వ్యాపింపచేశారు. అయితే ప్రస్తుతం మరో కొత్త వైరస్‌ల చైనాలో పుట్టినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 వైరస్‌లు పుట్టినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ ఒక్కసారి సోకితే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ వైరస్ ఏంటి? ఎలా పుట్టింది? ఎందుకు ఇది చాలా ప్రమాదకరం? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
యునాన్ ప్రావిన్స్‌లో 2017 నుంచి 2021 మధ్య 142 గబ్బిలాలపై పరిశోధనలు చేశారు. ఈ గబ్బిలాల కిడ్నీ నమూనాలను సేకరించగా.. మొత్తం 22 విభిన్న రకాలు వైరస్‌లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అందులో నిప, హెండ్రా హెనిపావైరస్‌లను పోలి ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అయితే ఈ వైరస్‌లు చాలా ప్రమాదకరమైనవని నిపుణులు అంటున్నారు. ఇవి మెదడులో వాపును కలిగించడంతో పాటు అనేక సమస్యలు వచ్చేలా కూడా చేస్తాయని చెబుతున్నారు. ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ వైరస్‌ను గబ్బిలాలో గుర్తించారు. అయితే ఇవి సమీపంలోని ఏవైనా పంటలను తింటే.. వాటిని మానవులు తింటే సోకుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా ఒకరి నుంచి మరోకరికి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ఎక్కువగా శుభ్రం లేని ప్రదేశాల్లో ఉంటుందని గుర్తించారు. వీటివల్ల కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కలుషితమైన నీరు, ఫుడ్ అన్ని రకాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఇది కేవలం గబ్బిలాల మూత్రం ద్వారా వ్యాపిస్తుందని గుర్తించారు. ఇవి కనుక మానవులు తినే పండ్లు, కూరగాయలు వంటి వాటిని తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్‌ను ‘బ్యాట్ వైరస్’ అని అంటారు. దీని చాలా ప్రమాదకరమైనది. పరిశుభ్రత లేకుండా ఫుడ్ తీసుకోవడం, గబ్బిలాలు తిన్న వాటిని తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు ఏ వైరస్‌లు చుట్టు ముట్టుకుంటాయో సరిగ్గా తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. తినే ఆహారం నుంచి అన్ని విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
-
Skyrider X6: వచ్చేస్తున్న ఎగిరే బైక్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Rare Earth Elements : చైనాకు ఝలక్ ఇవ్వబోతున్న టాటా మోటార్స్.. రేర్ ఎర్త్ విషయంలో ‘డ్రాగన్’ ప్లాన్ ఫెయిల్!
-
Carona :పెరుగుతున్న కరోనా.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
AI Hospital : ప్రపంచపు మొట్టమొదటి AI ఆస్పత్రిని ప్రారంభించిన చైనా.. డాక్టర్లంతా రోబోలే
-
Pig Liver To Human: వైద్యశాస్త్రంలో మరో అద్భుతం.. మానవునికి పంది కాలేయం