Rare Earth Elements : చైనాకు ఝలక్ ఇవ్వబోతున్న టాటా మోటార్స్.. రేర్ ఎర్త్ విషయంలో ‘డ్రాగన్’ ప్లాన్ ఫెయిల్!

Rare Earth Elements : మన దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అయిన టాటా మోటార్స్ ఇప్పుడు చైనాకు గట్టి జవాబు ఇవ్వడానికి రెడీ అవుతుంది. చైనా విధించిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతి ఆంక్షల వల్ల భారత కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రేర్ ఎర్త్ లోహాలు దొరకకపోతే తమ ఉత్పత్తి తగ్గిపోతుందేమో అని టాటా మోటార్స్ కొంత ఆందోళన పడుతోంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి టాటా మోటార్స్ భారత ప్రభుత్వంతో కలిసి మాట్లాడుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతోంది. చైనా ఒక్కసారిగా రేర్ ఎర్త్ మాగ్నెట్‌ల ఎగుమతిపై నిషేధం విధించడంతో ప్రపంచ ఆటో పరిశ్రమలో టెన్షన్ మొదలైంది. ఒకవేళ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరా ఇలాగే ఆగిపోతే, భవిష్యత్తులో కార్ల ఉత్పత్తి కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని చాలా ఆటో కంపెనీలు భయపడుతున్నాయి.
Read Also:Mohan Babu : మంచు విష్ణు కోసం న్యూజిలాండ్ లో 7000ఎకరాలు కొన్న మోహన్ బాబు.. వీడియో వైరల్
రేర్ ఎర్త్ మాగ్నెట్‌లు అనేవి ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా ముఖ్యమైన భాగాలు. అంతేకాదు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో నడిచే వాహనాల్లో కూడా ఈ మాగ్నెట్‌లను చాలా ఎక్కువగా వాడతారు. ప్రపంచంలో 90 శాతానికి పైగా రేర్ ఎర్త్ మాగ్నెట్‌లను చైనానే ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు చైనా హఠాత్తుగా ఎగుమతులపై నిషేధం పెట్టడంతో ఆటో పరిశ్రమలోని కంపెనీలకు పెద్ద తలనొప్పి మొదలైంది. టాటా మోటార్స్ మాత్రం, ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్‌ల కోసం ప్రత్యామ్నాయ వనరులను వెతుకుతూ, ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని చెబుతోంది.
Read Also:Vaibhav Suryavanshi : గిల్, పంత్ బాటలో వైభవ్ సూర్యవంశీ.. ఇక ఇంగ్లాండ్ లోనూ మెరుపులు
టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు రేర్ ఎర్త్ గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో జాగ్రత్తగా గమనిస్తున్నామని చెప్పారు. భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రేర్ ఎర్త్ మాగ్నెట్‌ల దిగుమతి కోసం చైనా ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని ఇప్పటికే ప్రభుత్వ సాయం కోరింది. అయితే, ఈ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇదిలా ఉండగా, ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవ టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అడిగినప్పుడు చంద్రశేఖరన్ ఈ కంపెనీలు తక్కువ సమయంలో వచ్చే ఏ సమస్యలనైనా ఎదుర్కోగలవు అని చెప్పారు.
-
Karakoram Highway : ప్రపంచంలోనే ఎత్తైన రహదారి.. ప్రకృతి అందాలకు, సాహస యాత్రకు అడ్డా.. ఎక్కడ ఉందంటే ?
-
China danger virus: చైనాలో మరో కొత్త డేంజర్ వైరస్.. సోకితే ప్రాణాలకే ప్రమాదం
-
Skyrider X6: వచ్చేస్తున్న ఎగిరే బైక్‌లు.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
China Ban : చైనా దెబ్బకు భారత్ లో ప్రమాదంలో 21,000ఉద్యోగాలు
-
UPI : యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. మోసాలకు చెక్ పెట్టేలా కొత్త సిస్టమ్
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్