Mohan Babu : మంచు విష్ణు కోసం న్యూజిలాండ్ లో 7000ఎకరాలు కొన్న మోహన్ బాబు.. వీడియో వైరల్

Mohan Babu : తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇది శోభన్ బాబు నేర్పిన పాఠం అని చెప్పొచ్చు. శోభన్ బాబును ఆదర్శంగా తీసుకుని, తెలుగులో చాలామంది నటీనటులు తమ సినిమా సంపాదనను భూమి మీద పెట్టుబడి పెట్టారు.. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళలో సీనియర్ నటుడు మోహన్‌బాబు కూడా ఒకరు. సినిమా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పెద్ద సక్సెస్ సాధించిన మోహన్‌బాబు ఒక మంచి వ్యాపారవేత్త కూడా. ఆయనకు చాలా పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు, రిసార్ట్‌లు, హోటల్స్ ఇలా చాలా ఉన్నాయి. చాలా చోట్ల రియల్ ఎస్టేట్‌లో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఇటీవలే మోహన్‌బాబు నిర్మాణంలో వస్తున్న ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. ఇప్పుడు, అక్కడే మోహన్‌బాబు భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టారని వార్తలు వస్తున్నాయి.
మోహన్‌బాబు ఆయన కొడుకు మంచు విష్ణుతో కలిసి ఉన్న ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మోహన్‌బాబు గారు న్యూజిలాండ్‌లోని వలాకా అనే ప్రాంతంలో ఏడు వేల ఎకరాల భూమిని కొన్నట్లు చెబుతున్నారు. మంచు విష్ణు కూడా దానికి అవునని అంటున్నారు. మోహన్‌బాబు ఒక విశాలమైన ఖాళీ స్థలం ముందు నిలబడి ఉన్నారు. ఆయన ముందు కొండలు, నది అన్నీ కనిపిస్తున్నాయి. వాటిని చూపిస్తూ.. “ఏడు వేల ఎకరాల భూమిని కొన్నాం. ఈ ఇల్లు, ఈ స్థలం అంతా ఇకపై మంచు విష్ణుదే” అని మోహన్‌బాబు అన్నారు.
Read Also:Vaibhav Suryavanshi : గిల్, పంత్ బాటలో వైభవ్ సూర్యవంశీ.. ఇక ఇంగ్లాండ్ లోనూ మెరుపులు
Mohanbabu Mass 😂😂😂#JustforGags pic.twitter.com/Nbb2y053R6
— V@ndeM@taR@m (@patriotatwork99) June 22, 2025
అదే సమయంలో అక్కడికి నటుడు ప్రభుదేవా కూడా వచ్చారు. అప్పుడు మోహన్‌బాబు.. “ఈ కొనుగోలుకు ప్రభుదేవా కూడా సాక్షి” అని అన్నారు. దానికి ప్రభుదేవా కూడా అవునని చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా భూములు, వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి, ఆయన న్యూజిలాండ్‌లో భూమి కొని ఉండొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. అయితే, న్యూజిలాండ్‌లో విదేశీయులు భూమి కొనడం అంత సులభం కాదు. కనీసం 12 నెలల పాటు అక్కడ నివసించని వాళ్ళు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనడం చాలా కష్టం. దీనికి ఓవర్‌సీస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ అనుమతి తీసుకోవాలి.
కానీ, కొనే వ్యక్తి సింగపూర్ లేదా ఆస్ట్రేలియా పౌరుడైతే కొనుగోలు కొంచెం సులభం అవుతుంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. మంచు విష్ణు సింగపూర్ పౌరుడు అని చెబుతున్నారు. ఆ విధంగా మోహన్‌బాబు ఈ కొనుగోలు చేసి ఉండొచ్చు అని అంటున్నారు. అయితే, మోహన్‌బాబు వీడియోలో ఏడు వేల ఎకరాలు కొన్నానని చెప్పారు. ఇది నిజంగానే కొన్నారా, లేదా మోహన్‌బాబు గారు ఏదైనా సరదాగా చెప్పారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
Read Also:Snake : పాము పగ నిజమా? అపోహనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Kannappa Movie Collections: రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నప్ప.. బ్రేక్ ఈవెన్‌కు సమయం పడుతుందా?
-
Manchu Vishnu Post: దొంగతనంతో సమానం.. కన్నప్ప మూవీ పైరసీపై బాధ వ్యక్తం చేసిన విష్ణు!
-
Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
-
Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!
-
Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ
-
Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ