China Ban : చైనా దెబ్బకు భారత్ లో ప్రమాదంలో 21,000ఉద్యోగాలు

China Ban : చైనా ఇప్పుడు భారత్కు మరో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ అనే ప్రత్యేకమైన లోహాలపై ఎగుమతి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీని వల్ల మన దేశంలో దాదాపు 21,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని భారత ఎలక్ట్రానిక్ పరిశ్రమల సంస్థ ELCINA అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఆడియో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ దెబ్బ ఎక్కువ ఉంటుందని ఆయా రంగాలకు చెందిన వాళ్లు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. గత ఏప్రిల్లో చైనా, టెర్బియం, డిస్ప్రోసియం లాంటి రేర్ ఎర్త్ పదార్థాలపై కఠినమైన లైసెన్సింగ్ నిబంధనలు పెట్టి, వాటి ఎగుమతిని దాదాపు ఆపేసింది. ఈ పదార్థాలు ఎలక్ట్రానిక్స్లో వాడే స్పీకర్లు, ఇతర వస్తువులకు చాలా అవసరం. వీటితోనే మంచి క్వాలిటీ గల మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు.
Read Also : Niharika : తప్పు నాదే.. నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
మన దేశంలో చాలా పాత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల సంస్థ అయిన ఎల్సినా చెప్పిన దాని ప్రకారం.. చైనా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ చాలా దెబ్బతింది. దీని వల్ల భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఆడియో ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ నష్టం కలగవచ్చు. అందుకే, ఇప్పుడు తయారీ కంపెనీలు చైనా నుంచే పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్ మాడ్యూల్స్ దిగుమతి చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, దేశంలో స్పీకర్లు, ఆడియో సిస్టమ్స్ భాగాలు తయారు చేసే ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా నొయిడా, దక్షిణ భారతదేశం లాంటి ప్రాంతాల్లో ఈ పని పెద్ద ఎత్తున జరుగుతుంది. పరిస్థితి కాస్తో కూస్తో మెరుగుపడకపోతే ఈ రంగంలో ప్రత్యక్షంగా 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు, అలాగే పరోక్షంగా దాదాపు 15,000 ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది.
Read Also : Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్
స్పీకర్లు తయారు చేయడానికి వాడే రేర్ ఎర్త్ మాగ్నెట్స్ చాలా ముఖ్యమైనవి. వీటిని ముఖ్యంగా చిన్నగా ఉండే, కానీ పవర్ ఫుల్ స్పీకర్లలో వాడతారు. ఈ మాగ్నెట్స్ ఒక స్పీకర్లో దాదాపు 5-7శాతం ఉంటాయి. భారతదేశం ఈ అయస్కాంతాలను దాదాపు పూర్తిగా దిగుమతి చేసుకోవాలి. ఈ దిగుమతుల్లో 90శాతం పైగా చైనా నుంచే వస్తాయి. ఇటీవల చైనాలో సరఫరా సమస్యలు, అడ్డంకుల వల్ల అక్కడి అయస్కాంతాలు ఖరీదైనవిగా మారాయి. ఇది కాకుండా, జపాన్, అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి ఈ అయస్కాంతాలు 2 నుండి 3 రెట్లు ఎక్కువ ధరలకు దొరుకుతాయి. పైగా, అక్కడి నుంచి భారతదేశం పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి సరిపడా సరఫరా కూడా లేదు. టీవీలు తయారు చేసే కంపెనీ వీడియోటెక్స్ కూడా ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ముఖ్యంగా టీవీల స్పీకర్లలో చాలా అవసరమని పేర్కొంది. ఇవి చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా, వాటి పనితీరు కూడా చాలా బాగుంటుంది. అందుకే, వీటికి వేరే ప్రత్యామ్నాయం దొరకడం కష్టమని పేర్కొంది.
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే