Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Naga Babus Key Comments On Niharikas Second Marriage

Niharika : తప్పు నాదే.. నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

Niharika : తప్పు నాదే.. నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
  • Edited By: rocky,
  • Updated on June 22, 2025 / 09:47 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Niharika : మనదేశంలో కుటుంబ బంధాలకు, సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను ప్రజలు చాలా క్షుణ్నంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తె నిహారిక కొణిదెల వివాహ బంధం, విడాకులు, భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, ముందుకు సాగాలనే తత్వాన్ని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతుంది. నాగబాబు తన కుమార్తె భవిష్యత్తుపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో తెలుసుకుందాం.

నిహారిక విడాకుల విషయం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిహారిక రెండో పెళ్లిపై ఆమె తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తన కూతురు నిహారిక పెళ్లి విషయంలో తప్పు చేశామని అంగీకరించారు. 2020లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాతే పరిస్థితులు తలకిందులయ్యాయి. క్రమక్రమంగా ఇద్దరి మధ్య గొడవలు, దూరం పెరిగింది. భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2023లో నిహారిక- చైతన్య చట్ట పరంగా విడాకులు తీసుకున్నారు.

Read Also:Dhanush: చిరంజీవిని చూడగానే ధనుష్ చేసిన పని వైరల్.. ఊహించని ఘటనకు అంతా షాక్

తాజాగా ఈ విషయం గురించి నాగబాబు మాట్లాడుతూ.. నా కూతురు నిహారిక నేను ఎక్కువగా మాట్లాడుకుంటాం. పిల్లల కెరీర్‌ విషయాల్లో నేను అసలు తలదూర్చను. నా పిల్లల హిట్స్‌, ఫ్లాప్స్ గురించి నాకు అవసరం లేదు. వాళ్లు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే నాకు ముఖ్యం. సంతోషంగా ఉంటే అది నాకు తృప్తిగా ఉంటుంది. వాళ్లు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా వృథానే! వరుణ్‌.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా వద్దకు వచ్చినప్పుడు ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా? భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా ? అన్నాను. లేదు, సంతోషంగానే ఉంటాం అని ఆన్సర్ ఇచ్చాడు. సరే అని పెళ్లి చేశాం. వాడి జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అయింది. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.

కానీ నా కూతురు విషయంలో నా జడ్జిమెంట్‌ తప్పు అయింది. ఆ పెళ్లి మేం చేసిన తప్పు. మేం సరిగా జడ్జిమెంట్ చేయలేకపోయాం. అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి చేయలేదు. తను సంబంధం ఓకే అన్న తర్వాతనే ముందుకు వెళ్లాం. కాకపోతే తనకు, ఆ అబ్బాయికి సింక్‌ అవ్వలేదు.మ్యూచువల్ అండర్ స్టాండింగుతో విడిపోయారు. వారిద్దరూ కలిసుండేందుకు నేనెలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇష్టం లేదన్నారు సరే అన్నాను. ఇప్పుడు తను నిర్మాతగా సినిమాలు నిర్మిస్తోంది. కొంతకాలం పోయాక ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

Read Also:Pawan Kalyan : పంచెకట్టులో పవర్ స్టార్..అదిరిపోయిన పవన్ కళ్యాణ్ కొత్త లుక్

Tag

  • divorce
  • Naga Babu
  • Niharika Konidela
  • Personal Life
  • Second Marriage
Related News
  • Saina Nehwal – Kashyap: విడాకులు ప్రకటించిన సైనా.. కశ్యప్‌తో విడిపోవడానికి కారణమిదేనా?

  • Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య

  • Meena Kumari: పెళ్లి, పిల్లలు, విడాకులు అన్ని 38 ఏళ్లకే.. కనిపించేంత అందంగా ఎవరి లైఫ్ ఉండదుగా!

  • Personal Life: వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని బాలెన్స్ చేసుకోండిలా

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us