Saina Nehwal – Kashyap: విడాకులు ప్రకటించిన సైనా.. కశ్యప్‌తో విడిపోవడానికి కారణమిదేనా?

Saina Nehwal – Kashyap: ప్రస్తుత కాలంలో సామాన్య మనుషులే కాదు.. సెలబ్రిటీలు కూడా విడిపోతున్నారు. పెళ్లి చేసుకున్న ఏడాది అయిన వారు, ఎన్నో ఏళ్ల నుంచి కలిసి ఉంటున్న వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా క్రీడలకు సంబంధించిన వారు కూడా ఈ మధ్య విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి అయి పిల్లలు ఉన్నా కూడా దూరంగా ఉండాలని డిసైడ్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నట్లు ప్రకటిస్తున్నారు. వీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అంటున్నారు. అయితే ఇటీవల భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పెళ్లి చేసుకుని ఏడేళ్లు కాగా.. వారి వివాహ బంధానికి ఇటీవల ముగింపు పలుకుతున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సైనా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంతగానో ఈ విషయం గురించి ఆలోచించి తాను, కశ్యప్ విడిపోవాలని అనుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు.
జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక్కో మార్గంలో తీసుకెళ్తుందని అన్నారు. కశ్యప్ నేను ఎన్నో విధాలుగా చర్చించాలి. చర్చలు జరిగిన తర్వాత ఆలోచించిన తర్వాతనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇద్దరం కలిసి ఎలాగో ప్రశాంతంగా ఉండలేం. కనీసం విడిపోయి అయినా ప్రశాంతంగా ఉందామని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు. గౌరవం ఇస్తారని భావిస్తున్నామని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై కశ్యప్ ఇంకా స్పందించలేదు. కేవలం సైనా మాత్రమే ఈ పోస్ట్ చేశారు. అయితే సైనా, కశ్యప్ ముందుగా స్నేహితులుగా ఉండేవారు. బ్యాడ్మింటన్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు స్నేహితులుగా మారారు. ఈ సమయంలో వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత 2018లో ఇద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే సైనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాయాల బారిన పడింది. ఈ క్రమంలో కాస్త ఫామ్ కోల్పోయింది. 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో చివరిగా ఆడింది. అయితే సైనా ప్రస్తుతం ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు గతేడాది తెలిపింది. ఇంతలోనే వ్యక్తిగత విషయంపై కూడా స్పందించింది.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు