Meena Kumari: పెళ్లి, పిల్లలు, విడాకులు అన్ని 38 ఏళ్లకే.. కనిపించేంత అందంగా ఎవరి లైఫ్ ఉండదుగా!

Meena Kumari: కనిపించేంత అందంగా ఎవరి లైఫ్ ఉండదు. కొందరు లైఫ్ పైకి అందంగా కనిపించినా కూడా కష్టాలే ఉంటాయి. సాధారణంగా సినిమా వాళ్ల లైఫ్ బాగుంటుందని, ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు. కానీ తెర పైన కనిపించేంత అందంగా అయితే వారి లైఫ్ ఉండదు. జీవితంలో సంతోషం కంటే కష్టాలను అనుభవించి చిన్న వయస్సులో మృతి చెందారు లెజెండరీ హీరోయిన్ మీనా కుమారి. ఆమె బయటకు చెప్పుకోలేని ఎన్నో కష్టాలను అనుభవించింది. మీనా కుమారి వెండితెర మీద ఎన్నో అద్భుతాలు సృష్టించింది. అయితే ఆమె జీవితాన్ని ఆమె చేతులారా చిన్న వయస్సులోనే ముగిసిపోయేలా చేసుకుంది. తండ్రి చిన్నతనంలో అనాథ శ్రమంలో వదిలేశాడు. ఎలాగైనా లైఫ్‌లో సెటిల్ కావాలని నటిగా మారింది. అయితే మీనాకుమారి అసలు పేరు మహాజభింభాను. 1933లో అలీ బక్స్, ఇక్బాల్ బేగం దంపతులకు పుట్టింది. అప్పట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటంతో తండ్రి వదిలేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ కూతురుని తీసుకొచ్చాడు. అయితే కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా చిన్నతనంలోనే మీనాను సినిమాలకు పంపించారట.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం మొదలు పెట్టి.. బచ్చోంకా ఖేల్ అనే సినిమాతో హీరోయిన్‌గా మీనా ఎంట్రీ ఇచ్చింది. ఈ సమయంలో హీరోయిన్‌గా రాణించింది. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు మీనాకుమారి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. మీనా కేవలం నటన మాత్రమే కాకుండా కవయిత్రి, సింగర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా రాణించారు. తన నటనకు ఎందరో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే మీనా ఎమోషనల్‌గా నటించడంతో ట్రాజడీ క్వీన్ అనే బిరుదు కూడా ఉందట. అయితే మీనా తన 30 ఏళ్ల సినీ జీవితంలో దాదాపుగా 90కి పైగా సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. అయితే మీనా తన 18 ఏళ్ల వయస్సులో అప్పటికే పెళ్లి చేసుకున్న 34 ఏళ్ల ప్రముఖ దర్శకుడు కమల్ అమరోహిని పెళ్లి చేసుకుంది.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
మొదట్లో అంతా కూడా బాగానే ఉన్నా తర్వాత వారి సంసార బంధంలో గొడవలు వచ్చాయి. దీంతో 1964లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే పెళ్లి విడాకులు కావడంతో మీనా కుమారి బాగా మద్యానికి బానిస అయ్యింది. ఎక్కువగా మద్యం సేవించడంతో ఆమె 1972లో తన 38 ఏళ్ల వయస్సులో మృతి చెందింది. ఇప్పుడున్న హీరోయిన్లు అయితే ఈ వయస్సుకి పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు అయితే అసలు పెళ్లి ప్రస్తావన కూడా రావడం లేదు. కానీ మీనా కుమారి ఈ వయస్సుకు పెళ్లి, విడాకులు, మరణం అన్ని కూడా జీవితంలో తొందరగానే చూసింది. చాలా తక్కువ రోజులు మాత్రమే జీవించి సంతోషాన్ని కంటే కష్టాలను ఎక్కువగా చూసింది.
-
Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య
-
Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?
-
Summer: వేసవి సెలవుల్లో పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండాలంటే.. వీటిని నేర్పించండి
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Couples: దంపతులు ఈ టిప్స్ పాటిస్తే.. 30 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీ
-
Marriage: ఇలాంటి వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోవద్దు. లేదంటే జీవితం నరకమే..