Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట

Alia Kapoor : నటి ఆలియా భట్ (Alia Bhatt) గురించి బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో తాను చాలా పాపులర్ స్టార్ హీరోయిన్. అయితే, ఇప్పుడు ఆమె తన పేరును మార్చుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆమె పేరు మార్చుకోవడం విశేషం. ‘ఆలియా’ అనేది అలాగే ఉంది, కానీ ‘భట్’ స్థానంలో ఆమె ‘కపూర్’ అని మార్చుకుంది. ఈ విషయం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఆలియా భట్ అనే పేరు అలాగే ఉండాల్సిందని చాలా మంది అంటున్నారు.
ఆలియా భట్, కపూర్ కుటుంబానికి చెందిన రణబీర్ కపూర్‌ను (Ranbir Kapoor) వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమెను ఆలియా భట్ అనే పిలుస్తున్నారు. గతంలో బచ్చన్ (Bachchan) కుటుంబంలోకి వచ్చిన ఐశ్వర్య రాయ్‌ను (Aishwarya Rai) ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని, కరీనా కపూర్‌ను (Kareena Kapoor) కరీనా కపూర్ ఖాన్ అని పిలుస్తున్నారు. కానీ, ఆలియాను మాత్రం ‘ఆలియా భట్ కపూర్’ అని ఎప్పుడూ పిలవలేదు. అయితే, ఇప్పుడు ఆమె తన పేరును అధికారికంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఆలియా భట్ ఒక వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె బస చేసిన హోటల్ (Hotel) గది దృశ్యం కూడా ఉంది. ఆ హోటల్‌లో ఆమె పేరు ‘ఆలియా కపూర్’ (Alia Kapoor) అని రాసింది. దీనితో ఆలియా భట్ తన పేరును అధికారికంగా మార్చుకుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు:
ఈ పోస్ట్‌పై చాలా మంది రకరకాల కామెంట్లు చేశారు. “ఆమె నాకు ఎప్పుడూ ఆలియా భటే. అదే ఆమె బ్రాండ్. ఆమె పేరును ఎవరూ మార్చలేరు” అని కొందరు అన్నారు. “ఆలియా కపూర్ అని పిలవాలంటే మనసు రావట్లేదు. దయచేసి ఆలియా భట్ అనే పేరునే ఉంచుకోండి” అని మరికొందరు అన్నారు. ఇంకొందరు ఇది హోటల్ వారి తప్పై ఉండవచ్చని ఊహించారు.
ఆలియా కపూర్ కుటుంబానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంది కాబట్టి, హోటల్ వారు ఆమె పేరును ‘ఆలియా కపూర్’ అని మార్చి ఉండవచ్చని కొందరు ఊహిస్తున్నారు. ప్రస్తుతం ఆలియా తన కూతురు రహా (Raha) ఆలనా పాలనలో తీరిక లేకుండా ఉంది. దీనితో పాటు ఆమె సినిమాలు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె ‘లవ్ అండ్ వార్’ (Love and War) సినిమాలో నటిస్తోంది.
Read Also:Lemon Juice: నిమ్మరసంలో వీటిని కలిపి తాగితే.. జీవితాంతం ఆరోగ్యం మీకే
-
Ramayana : రామాయణం కోసం షాకింగ్ టెక్నాలజీ.. ఏకంగా 86 కెమెరాలతో షూటింగ్
-
Alia Bhatt : అసిస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్
-
Kajol : 11ఏళ్ల వయసులోనే స్కూల్ నుంచి పారిపోయిన కాజోల్..ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ రివీల్
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?
-
Marriage: పెళ్లంటే నూరేళ్లు పంట కాదు.. పెంట అంటున్న యువత!
-
Trivikram following Anil Ravipudi: వెంకటేష్ విషయంలో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాడా..?