Kajol : 11ఏళ్ల వయసులోనే స్కూల్ నుంచి పారిపోయిన కాజోల్..ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ రివీల్

Kajol : బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ తన పర్సనల్ విషయాలను తరచుగా పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కాజోల్ తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తన అమ్మమ్మ అంటే ఆమెకు ఎంత ప్రేమో, అందుకోసం కేవలం 11 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద సాహసానికి ఎలా సిద్ధమైందో వివరించింది. కాజోల్ పంచగనిలోని ఒక బోర్డింగ్ స్కూల్‌లో చదువుకునేది. ఒకసారి తన అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. అప్పుడు ఆమెకు 11 ఏళ్లు. అమ్మకు ఫోన్ చేసి ఇంటికి వస్తానని అడగ్గా, పరీక్షలు ఉన్నాయని, డిసెంబర్‌లో సెలవుల్లో రావచ్చని చెప్పింది. అయితే, అమ్మమ్మను చూడాలనే కోరికతో కాజోల్ అక్కడికక్కడే ఉండలేకపోయింది. “నా ఫ్రెండ్ కూడా ఏదో కారణంతో బాధపడుతూ ఉంది. అప్పుడు మేమిద్దరం కలిసి స్కూల్ నుంచి పారిపోయి ఎలాగైనా ముంబై వెళ్లాలని నిర్ణయించుకున్నాం” అని కాజోల్ చెప్పింది.
Read Also : Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్
కాజోల్ ఈ ప్లాన్‌ను అమలు చేయడానికీ వెనుకాడలేదు. పంచగనిలో ఉన్న తన మామ దగ్గరికి వెళ్లి, అమ్మ ఇంటికి రమ్మని పిలిచిందని తనను బస్ స్టాండ్‌కి తీసుకెళ్లమని అడిగానని చెప్పింది. మామ నిజమని నమ్మి తనను బస్టాఫ్ కు తీసుకెళ్లాడట. అంతా సవ్యంగానే జరుగుతోందని అనుకుంటున్న తరుణంలో, స్కూల్‌లో పనిచేసే నన్స్ ఆమె, తన ఫ్రెండ్స్ కోసం వెతుక్కుంటూ వచ్చారు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా, వాళ్ళు వచ్చి కాజోల్ చెవి పట్టుకుని తిరిగి స్కూల్‌కు తీసుకెళ్లారని ఆమె నవ్వుతూ గుర్తు చేసుకుంది.
Read Also : Subhaman Gill: ఈ స్టేడియంలో ధోనీ, కోహ్లీ ఓటమి.. మ్యాచ్ విజయంతో చరిత్ర సృష్టించిన గిల్
పంచగని నుంచి ముంబైకి ఐదు గంటల దూరం ఉన్నా, అమ్మమ్మ ప్రేమ ఆమెను దూరాన్ని లెక్కించనివ్వలేదు. అయితే, స్కూల్ యాజమాన్యం పట్టుకోవడంతో ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. తన పారిపోయే ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయినా కాజోల్ బోర్డింగ్ స్కూల్ రోజులను మంచి జ్ఞాపకాలుగా భావిస్తుంది. “అక్కడ పిల్లలు తల్లిదండ్రుల విలువను నేర్చుకుంటారు. అది సమాజానికి బాగా అలవాటు పడేలా చేస్తుంది” అని కాజోల్ వివరించింది. అందుకే తన పిల్లలను కూడా బోర్డింగ్ స్కూల్‌కు పంపాలని నిర్ణయించుకుంది. కాజోల్ నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘మా (Maa)’ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది.
-
Alia Bhatt : అసిస్టెంట్ చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్
-
Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట
-
Viral : రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు జంప్.. సాఫ్ట్ వేర్ ప్రపంచంలోనే సెన్సేషన్
-
Kangna Sharma : “బట్టలు విప్పే పోటీ జరుగుతోందా?”.. కంగనా శర్మపై నెటిజన్ల ట్రోలింగ్!
-
Katrina Kaif : సల్మాన్-రణ్‌బీర్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? షాకింగ్ ఆన్సర్ చెప్పిన కత్రినా
-
Bollywood Actress : పాన్ ఇండియా స్టార్ కి తల్లిగా, బాలీవుడ్ హీరో కి ప్రియురాలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుస్తా.. ఈమె ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..