Viral : రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు జంప్.. సాఫ్ట్ వేర్ ప్రపంచంలోనే సెన్సేషన్

Viral : ఢిల్లీకి చెందిన యువ సాఫ్ట్వేర్ డెవలపర్ దేవేష్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాను కేవలం ఒకే సంవత్సరంలో రూ. 5.5 లక్షల CTC (కాస్ట్ టు కంపెనీ) నుంచి ఏకంగా రూ. 45 లక్షల CTCకి ఎదిగానని అతను ట్వీట్ చేశాడు. అతని ఈ పోస్ట్ ఇంటర్నెట్లో కొత్త చర్చకు తెరలేపింది. చాలా మంది అతని అద్భుతమైన విజయాన్ని ప్రశంసించగా మరికొందరు నెటిజన్లు ఇది నిజమా, కలా అని నమ్మలేకపోతున్నారు. అయితే, ఈ అద్భుతం ఎలా జరిగిందో దేవేష్ వివరించడంతో అందరి సందేహాలు తీరాయి.
దేవేష్ మే 27న ఉదయం ‘ఎక్స్’లో ఇలా రాశాడు: “నా లాంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇది ఒక కలకు మించింది.” అని పేర్కొన్నాడు. అతను గతేడాది IBMలో కేవలం రూ. 5.5 లక్షల ప్యాకేజీతో తన కెరీర్‌ను ప్రారంభించానని, ఏడాది తిరిగేలోపే రూ.45 లక్షల ప్యాకేజీ ఆఫర్ తన చేతిలో ఉందని చెప్పాడు. కొత్తగా కెరీర్ ప్రారంభించే యువతకు దేవేష్ ఒక కీలక సలహా ఇచ్చాడు.. జీతం కంటే నైపుణ్యాలను పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. డబ్బుల కంటే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని దేవేష్ అన్నాడు. ఒకవేళ మంచి ప్యాకేజీ లభించకపోతే, తక్కువ జీతంతోనైనా కెరీర్‌ను ప్రారంభించి, ఆపై కష్టపడి, నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా పెద్ద జంప్ తీసుకోవచ్చని అతను సూచించాడు.
Read Also:Viral Video : ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్ పాస్‌తో కంగారూ.. విమానం ఎక్కిన పంది.. వైరల్ వీడియో
అయితే, దేవేష్ చెప్పిన ఈ విషయం చాలా మంది నెటిజన్లకు నమ్మశక్యం కాలేదు. కెరీర్ ప్రారంభంలో ఇంత పెద్ద జంప్ అసాధ్యమని చాలా మంది వ్యాఖ్యానించారు. దీనిపై దేవేష్ సమాధానమిస్తూ.. అమెజాన్, ఫేస్బుక్ వంటి పెద్ద టెక్ కంపెనీలలో ఒక స్థిరమైన సాలరీ స్ట్రక్ఛర్ ఉంటుందని చెప్పాడు. ఈ కంపెనీలు పాత జీతాన్ని చూడవు, బదులుగా టాలెంట్ మాత్రమే అంచనా వేస్తాయని దేవేష్ వివరించాడు.
Never mentioned it but tbh, I still sometimes think I am still in a dream, bcoz I started my full time career last year at IBM with just a CTC of 5.5 LPA, and now having an offer of over 45 LPA CTC in hand within an year, for a middle class guy like me, it’s still a dream❤️.
— Devesh (@theywayshhh) May 26, 2025
“కష్టపడితే, సరైన నైపుణ్యాలతో పెద్ద జంప్ సాధ్యమే” అని అతను గట్టిగా చెప్పాడు. ఎందుకంటే పెద్ద కంపెనీలలో అందరికీ ఒకే రకమైన అవకాశాలు లభిస్తాయి. కాకపోతే దానికి అర్హులని మనం నిరూపించుకోవాలి. మునుపటి జీతం ఎంత అనేది కంపెనీకి సంబంధం లేదని అతడు చెబుతాడు.
దేవేష్ పోస్ట్‌పై కామెంట్ల వర్షం కురిసింది. ఒక నెటిజన్..”ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద జంప్, ఇది మీ ప్రతిభకు నిదర్శనం” అని రాశాడు. మరొక నెటిజన్, “మీ స్ట్రాటజీల రోడ్ మ్యాప్ మాకు కూడా చెప్పండి” అని కోరాడు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం సిఫార్సు (recommendation), నెట్వర్కింగ్ లేకుండా ఇంత వేగంగా పురోగతి సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు.