Viral Video : ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్ పాస్‌తో కంగారూ.. విమానం ఎక్కిన పంది.. వైరల్ వీడియో

Viral Video : ఇటీవల సోషల్ మీడియాలో ఒక కంగారూ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ముద్దులొలికే కంగారూ ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర బోర్డింగ్ పాస్ (Boarding Pass) పట్టుకుని, స్కాన్ చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ కంగారూ యజమాని అని భావిస్తున్న ఒక మహిళ, ఎయిర్‌లైన్ సిబ్బందితో వాదిస్తోంది. ఎందుకంటే, ఈ కంగారూను విమానంలోకి ఎక్కడానికి అనుమతించడం లేదట. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు కోటి కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది.
విమానంలో కంగారూకు నో ఎంట్రీ
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ ఫ్లైట్ అటెండెంట్‌తో వాదిస్తూ కనిపిస్తుంది. తన కంగారూను విమానంలోకి ఎక్కడానికి నిరాకరించరు. తన కంగారూకు బోర్డింగ్ పాస్ ఉందని ఆమె వాదిస్తోంది. @itsme_urstruly అనే ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో షేర్ అయిన ఈ వీడియో చూడటానికి అచ్చు గుద్దినట్లు నిజంగానే జరిగినట్లు అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న నిజం మాత్రం వేరు.
Airline staff is not allowing this cute kangaroo to board the airplane,
the way he is holding the boarding pass and waiting to be scanned 🥺
(ai) pic.twitter.com/EHoSFkEECF
— Wholesome Side of 𝕏 (@itsme_urstruly) May 26, 2025
AI సృష్టించిన అద్భుతం
మీరు పోస్ట్‌కు రాసిన క్యాప్షన్‌ను జాగ్రత్తగా చూస్తే.. యూజర్ చివర్లో ‘AI’ అని రాశారు. ఇది ఈ దృశ్యం నిజమైనది కాదని చెప్పడానికి దీని సూచనగా అందించారు. మరింత పరిశోధన చేయగా, ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ పేజీ ‘ఇన్ఫినిట్ అన్రియాలిటీ (Infinite Unreality)’ నుంచి తీసుకున్నదని తెలిసింది. ఈ పేజీ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా సృష్టించిన వింతైన, ఆశ్చర్యకరమైన జంతువుల క్లిప్‌లను అప్లోడ్ చేయడంలో పాపులర్ చెందింది. ఈ పేజీలో విమానంలో కూర్చున్న హిప్పోపొటామస్ నుంచి విమానంలో ఎక్కుతున్న జిరాఫీ వరకు అన్నీ చూడవచ్చు.
View this post on Instagram
ఈ సరదా వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అడవిలో మంటలు వ్యాపించినట్లుగా వేగంగా విస్తరించింది. చాలా మంది నెటిజన్లు ఈ ముద్దులొలికే కంగారూను చూసి ఆనందించగా, చాలా మంది యూజర్లు ఇది నిజమని నమ్మి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది AI టెక్నాలజీ ఎంత రియలస్టిక్ సీన్లను క్రియేట్ చేస్తుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు