Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • National News »
  • India Biggest Airplane Crashes

India Biggest Airplane crashes: దేశాన్ని విషాదంలో నింపిన ఘోర విమాన ప్రమాదాలు.. ఇప్పటి వరకు దేశంలో ఎన్ని జరిగాయంటే?

India Biggest Airplane crashes: దేశాన్ని విషాదంలో నింపిన ఘోర విమాన ప్రమాదాలు.. ఇప్పటి వరకు దేశంలో ఎన్ని జరిగాయంటే?
  • Edited By: kusuma,
  • Updated on June 12, 2025 / 06:55 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

India Biggest Airplane crashes: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. ఈ విమానంలో మొత్తం 242 ప్రయాణికులు కూడా మృతి చెందారు. ఈ ఘోర విమాన ప్రమాదం యావత్తు భారత్‌ను కలచివేస్తోంది. 242 ప్రయాణికుల ప్రాణాలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే పోయాయి. ఈ గుజరాత్ విమాన ప్రమాదం దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. అయితే దేశంలో ఇప్పటి వరకు కొన్ని ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

చార్ఖీ దాద్రి జంక్షన్

దేశ చరిత్రలో అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇదే. 1996 నవంబర్ 12న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747 విమానం, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 విమానం రెండు కూడా ఢిల్లీ దగ్గర ఒకదానికొకటి ఢీకున్నాయి. అయితే ఈ రెండు ఢీకొనడంతో మొత్తం 349 మంది చనిపోయారు. కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ విమానం పైలట్ చేసిన తప్పు వల్ల ఈ విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సమాచారం లేకపోవడం వల్ల ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

పాట్నా ఎయిర్ క్రాష్

అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 కు చెందిన బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతుండగా పాట్నాలో కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 60 మందికి పైగా మృతి చెందారు. అయితే పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఈ ప్రమాద ఘటన జరిగింది.

ఔరంగాబాద్ విమాన ప్రమాదం

1993లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 491 ఔరంగాబాద్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోవడంతో 55 మంది చనిపోయారు.

ఇంఫాల్ విమాన ప్రమాదం

1991లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 257 ఇంఫాల్ దగ్గర కూలిపోవడంతో మొత్తం 69 మంది చనిపోయారు.

బెంగళూరు విమాన ప్రమాదం

ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 605 బెంగళూరులో కుప్పకూలిపోవడంతో 92 మంది మరణించారు. 1990లో ఈ ఘటన జరిగింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం

1988లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 113 అహ్మదాబాద్‌లో కూలిపోయింది. ఈ ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 133 మంది ప్రయాణికులు మృతి చెందారు.

బాంబే విమాన ప్రమాదం

1982లో ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కూలిపోవడంతో 17 మంది మరణించారు.

బాంబే విమాన ప్రమాదం

1978లో ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 అరేబియా సముద్రంలో కుప్పకూలడంతో 213 మంది చనిపోయారు.

ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

Tag

  • Airplane Crash
  • Delhi Airplane Crash
  • Gujarat
  • India Biggest Airplane crashes
Related News
  • Viral Video: ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్‌క్రీమ్ తినరు!

  • IPL 2025: ప్లేఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us