Young cricketer Dirdh Patel: యువ క్రికెటర్ దిర్ధ్ పటేల్‌ను పొట్టన పెట్టుకున్న ప్లేన్ క్రాష్

Young cricketer Dirdh Patel: ఇటీవల అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన యావత్తు భారత్‌ను కలచివేసింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోవడంతో మొత్తం 274 మంది మృతి చెందారు. వీరిలో ప్రయాణికులు 242 మంది ఉండగా ఒకరు మాత్రమే బయటపడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం (ఫ్లైట్ AI171)లో 241 మంది మృతి చెందారు. అయితే ఈ మృతులలో 23 ఏళ్ల యువ క్రికెటర్ దిర్ధ్ పటేల్ కూడా ఉండటం విషాదకరం.
గుజరాత్‌కు చెందిన దిర్ధ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ హడర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. టెక్ రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. దిర్ధ్ తన కోర్సులో అత్యధిక గ్రేడ్ సాధించాడు. దిర్ధ్ ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉండేవాడని, తన చదువును వాస్తవ ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించేవాడని గురువులు చెబుతున్నారు. చదువుతో పాటు దిర్ధ్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతను లీడ్స్ మోడర్నియన్స్ క్రికెట్ క్లబ్ కు 2024 సీజన్లో ఓవర్సీస్ ప్లేయర్‌గా ఆడాడు. అతను ఒక ప్రతిభావంతుడైన ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. కొత్త ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత కూడా క్రికెట్ ఆడాలని దిర్ధ్ పటేల్ ప్రణాళికలు వేసుకున్నాడు. అతని సోదరుడు కృతిక్ కూడా గతంలో పూల్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. దిర్ధ్ మరణ వార్త తెలిసిన తర్వాత అతను ఆడిన రెండు క్రికెట్ క్లబ్‌లు సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించాయి. సాంకేతిక రంగంలో తన వృత్తిపరమైన ఆశయాలను, క్రికెట్ పట్ల తనకున్న అభిరుచిని సమతుల్యం చేసుకోవాలని దిర్ధ్ కలలు కన్నాడు. కానీ ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న బోయింగ్ విమానం మధ్యాహ్నం ఒంటి గంట తరుణంలో బయలు దేరింది. ఫ్లైట్ బయలు దేరి రన్ వే దాటిన వెంటనే 650 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోతుంది. ఈ సమయంలో పైలెట్లు మేడే అని మూడు సార్లు చెప్పినట్లు బ్లాక్ బాక్స్ ద్వారా గుర్తించారు. కానీ కళ్లు మూసి తెరిచిన లోగా ఈ దారుణం అంతా జరిగిపోయింది. ప్రయాణికులకు కూడా ఏం జరుగుతుందని తెలిసేలోపే విమానం కూలిపోయి 30 సెకన్లలోనే పేలిపోయి మృతి చెందారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? విమానాల్లో దీని పాత్ర ఏంటి?
-
India Biggest Airplane crashes: దేశాన్ని విషాదంలో నింపిన ఘోర విమాన ప్రమాదాలు.. ఇప్పటి వరకు దేశంలో ఎన్ని జరిగాయంటే?
-
Viral Video: ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్‌క్రీమ్ తినరు!
-
IPL 2025: ప్లేఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?