Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? విమానాల్లో దీని పాత్ర ఏంటి?

Black Box: అహ్మదాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం క్రాష్ అయ్యింది. ఈ ఘోర విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు మృతి చెందారు. విమానం మెడికల్ హాస్టల్‌పై పడటంతో 24 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనే విషయం తెలియదు. లగేజీ ఎక్కువ కావడం, సాంకేతిక లోపాలు ఇలా వినిపిస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు ప్రారంభించింది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయం తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమాన ప్రమాదాలకు బ్లాక్ బాక్స్ ఎందుకు కీలక పాత్ర వహిస్తుంది? ఈ బ్లాక్ బాక్స్ నలుపు రంగులో ఉంటుందా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?
కంప్యూటర్‌లో ఉండే హార్డ్ డిస్క్ ఎంత ముఖ్యమూ.. విమానాల్లో బ్లాక్ బాక్స్ అంతే ముఖ్యం. ఈ బ్లాక్ బాక్స్ విమానంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేస్తుంది. కేవలం కాక్‌పిట్‌లోని పైలట్ల సంభాషణలు మాత్రమే కాకుండా, రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్‌మెంట్, పైలట్లు తమలో తాము ప్రైవేట్‌గా జరిపే సంభాషణలు ఇలా అన్నింటిని కూడా రికార్డు చేస్తుంది. విమానం టేకాఫ్ అయినప్పుటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు అన్ని విషయాలు కూడా ఇందులో రికార్డు అవుతాయి.
ఆరెంజ్ కలర్
ఈ బ్లాక్ బాక్స్ పేరుకు మాత్రమే. కానీ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. అయితే దీనిని ఆరెంజ్ కలర్‌లో పెట్టడానికి ముఖ్య కారణం ప్రమాదం జరిగినప్పుడు శిథిలాల మధ్య ఈజీగా గుర్తించడానికి ఇలా పెడతారు. అలాగే ఇది ఎలాంటి అగ్ని ప్రమాదాలను అయినా తట్టుకునేలా ఉంటుంది. ఇది ఒక క్రాష్ రెసిస్టెంట్ పరికరం. ఇది ఫ్లైట్ డేటా రికార్డర్ అనగా విమానం ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, విమానం ప్రయాణించే మార్గం వంటి అన్ని సాంకేతిక సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. అలాగే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కూడా పైలట్ల మధ్య జరిగే సంభాషణలు, రేడియో ప్రసారాలు, హెచ్చరిక అలారాలు, అలాగే కాక్‌పిట్ లోపల ఉన్న యంత్రాల శబ్దాలను కూడా రికార్డ్ చేస్తుంది. ఈ రెండు రికార్డర్లను చాలా భద్రంగా, బలమైన కేసింగ్‌లలో ఉంచుతారు. ఈ కారణంగా పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు, నీటి పీడనం వంటి వాటిని ఇవి తట్టుకోగలవు.
బ్లాక్ బాక్స్ కీలకం?
విమాన ప్రమాదాలకు గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ ముఖ్యమైనది. ఇది ప్రమాదానికి ముందు కాక్‌పిట్ లోపల, ఫ్లైట్ సిస్టమ్స్‌లో ఏం జరిగిందనే దానిపై ప్రతి సెకనుతో సహా డేటాను ఇస్తుంది. దీనిద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటారు. విమానంలో ఏదైనా భాగం పనిచేయకపోయినా, ఇంజిన్లలో ఏదైనా సమస్య వచ్చినా? పక్షులు ఢీకొనడం లేదా గాలిలో ఏదైనా అడ్డంగా తగిలియా? ప్రమాదానికి ముందు విమానంలో మంటలు చెలరేగాయా లేదా పేలుడు సంభవించిందా? పైలట్ల నుంచి ఏదైనా పొరపాటు జరిగిందా? సమయానికి స్పందించలేదా? మేడే (MAYDAY) కాల్ జారీ చేశారా? ఇలా అన్ని విషయాలు కూడా తెలియజేస్తుంది. ఇవన్నీ ఆ బ్లాక్ బాక్స్‌లో రికార్డు అయి ఉంటాయి.
ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట