IPL 2025: ప్లేఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

IPL 2025: భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో ఐపీఎల్ సీజన్ 2025ను వాయిదా వేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్న తర్వాత నేటి నుంచి ఐపీఎల్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ సీజన్ ఇప్పటికే అల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఈ సీజన్లో ఇంకా 17 మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. నేటి నుంచి ప్రారంభం అవుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లలో మొత్తం ఆరు స్టేడియంలో వీటిని నిర్వహించనున్నారు. బెంగళూరు, జైపుర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికల్లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. నేడు ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. అయితే నేటి నుంచి స్టార్ట్ అయ్యే మ్యాచ్‌లలో ప్లే ఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే కొన్ని జట్టు మ్యాచ్‌లు గెలవాలి. ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు గుజరాత్ మూడు మ్యాచ్‌లలో ఒకటి, ఆర్సీబీ జట్టు 3 మ్యాచులలో ఒకటి, పంజాబ్ మూడు మ్యాచ్‌లలో రెండు, ముంబై ఇండియన్ రెండు మ్యాచ్‌లలో 2, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌లలో 2 గెలవాల్సి ఉంది. అయితే వీటితో పాటు కేకేఆర్, లక్నోకి కూడా అవకాశం ఉంది. అయితే ఇది మిగతా జట్లు గెలుపు, ఓటమి బట్టి ఉంటుంది.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
ఐపీఎల్ 2025 సీజన్లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ మే 29 న నిర్వహించనుంది. ఇక 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని అయితే బీసీసీఐ వెల్లడించలేదు. అయితే ఐపీఎల్ ఈ సీజన్లో టాప్‌లో గుజరాత్ టైటాన్స్ ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో రాయల్ ఛాలెంజర్స్, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడిన 8 గెలిచి మూడు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలవగా మూడు ఓడిపోయింది. అయితే రన్‌రేట్ గుజరాత్‌కు ఎక్కువగా ఉండటంతో మొదటి ప్లేస్‌లో ఉంది. ఇందులో మొత్తం 12 మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్ ఆడి 7 మాత్రమే గెలిచింది. మిగిలిన మూడు ఓడిపోయింది.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో గడుపుదామని వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ పాక్ భారత్‌పైకి డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో బీసీసీఐ ఐపీఎల్ 2025ను మధ్యలోనే ఆపేసింది. నిజానికి ధర్మశాలలో మ్యాచ్ జరగుతుండగా ఆపేసింది. పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉండటంతో భద్రతా దృష్ట్యా బీసీసీఐ వెంటనే సీజన్‌ను వాయిదా వేసింది. వాటినే నేటి నుంచి ప్రారంభించనుంది.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
-
IPL 2025: పంజాబ్ జట్టు సరికొత్త రికార్డు
-
IPL 2025: ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే.. డైరెక్ట్ ప్లేఆఫ్స్
-
Viral Video: ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్‌క్రీమ్ తినరు!
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్‌కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు.. ఐపీఎల్ చరిత్రలోనే రియాగ్ పరాగ్ రికార్డు