IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!

IPL 2025 : ఐపీఎల్ 2025 వేలం సందర్భంగా తనను రూ.20 కోట్లకు పైగా కొనుగోలు చేసిన విషయం తెలిసి కంగారుపడి వాష్ రూంలోకి పరిగెత్తానని పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఇటీవల వెల్లడించారు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను 2014 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్. ఆయన ఆశ్చర్యకరమైన ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఐపీఎల్ వేలంలో ఊహించని ధర
పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టును 2014 తర్వాత తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. పంజాబ్ కింగ్స్ సహ-యజమాని ప్రీతి జింటా (Preity Zinta)తో మాట్లాడుతూ.. ఈ సీజన్ వేలం సమయంలో తనను రూ.20 కోట్లకు పైగా కొనుగోలు చేశారని తెలిసినప్పుడు, తాను నేరుగా వాష్ రూంలోకి పరుగెత్తానని ఆయన వెల్లడించారు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, జట్టును టైటిల్ మ్యాచ్‌కు చేర్చారు. అయితే, ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.
Read Also:Starlink : జియోలాంటి ప్లాన్స్‌తో స్టార్‌లింక్ ఎంట్రీ..ఇంటర్నెట్ మార్కెట్లో మస్క్ సంచలనం!
పంజాబ్ భారీ ధరతో కొనుగోలు
గత సీజన్లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టైటిల్ గెలుచుకుంది. అయినప్పటికీ, కేకేఆర్ అతడిని విడిచి పెట్టింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతను రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగాడు. అయితే, పంజాబ్ కింగ్స్ అతన్ని ఏకంగా రూ.26.75 కోట్లకు తమ జట్టులోకి తీసుకుంది. రిషబ్ పంత్ తర్వాత ఐపీఎల్లో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. ఐపీఎల్ 2025 మెగా వేలం సమయంలో తన బిడ్ రూ.20 కోట్లు దాటగానే, తనకు కంగారు పట్టి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయానని ప్రీతి జింటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ తెలిపారు.
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ
శ్రేయాస్ అయ్యర్‌ను తమ జట్టులోకి చేర్చుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొదట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీలో ఉన్నప్పటికీ రూ.10 కోట్ల బిడ్ తర్వాత అది వెనుకకు తగ్గింది. అయితే, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిడ్డింగ్ కొనసాగింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.26.50 కోట్ల వరకు బిడ్ వేసింది, కానీ చివరికి పంజాబ్ కింగ్స్ రూ. 26.75కోట్లతో బిడ్‌ను గెలుచుకుని శ్రేయాస్ అయ్యర్‌ను తమ జట్టులోకి చేర్చుకుంది.
Read Also:Viral Video: మునిగిపోతున్న జింకపిల్లను రక్షించిన ఏనుగు.. వైరల్ వీడియో
కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించిన శ్రేయాస్!
పంజాబ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ జట్టును కొత్త స్థాయికి తీసుకెళ్లారు. జట్టును ఫైనల్‌కు చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ, ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి విమర్శకులందరి నోళ్లు మూయించారు. దీనితో పాటు, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా రాణించారు. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్‌లలో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. శ్రేయాస్ కెప్టెన్సీ, బ్యాటింగ్ ప్రదర్శన ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
-
RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
-
Jofra Archer : 1596 రోజుల తర్వాత టీంలోకి తిరిగొచ్చిన స్టార్ ప్లేయర్.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే