Viral Video: మునిగిపోతున్న జింకపిల్లను రక్షించిన ఏనుగు.. వైరల్ వీడియో

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే నేడు సోషల్ మీడియాలో ఏనుగుకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నీటిలో మునిగిపోతున్న ఒక చిన్న జింకపిల్లను ఏనుగు కాపాడింది. జంతువుల మధ్య ఉండే ప్రేమను, దయా గుణం మనుషుల కంటే బెటర్ చాటి చెప్పిన ఈ సంఘటన ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో ఒక పెద్ద చెరువులో ఓ చిన్న జింకపిల్ల నీటిలో మునిగిపోతూ ప్రాణాల కోసం అల్లాడుతూ కనిపించింది. అయితే ఇది గుంపు నుంచి విడిపోయి ఉండవచ్చు. ఇలా తప్పిపోయి ప్రమాదవశాత్తు నీటిలోకి పడిపోయి ఉండవచ్చు. అయితే ఈ జింకపిల్ల ప్రమాదంలో ఉండటాన్ని చూసిన ఒక పెద్ద ఏనుగు వెంటనే దానిని రక్షించడానికి ముందుకు వచ్చింది. ఆ ఏనుగు చాలా జాగ్రత్తగా తన తొండంతో జింక పిల్లను నీటి నుంచి పైకి లేపి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఏనుగు ఎంత సున్నితంగా, దయా గుణంతో ఆ జింకపిల్లను కాపాడిందో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాలు దక్కించుకున్న జింకపిల్ల వెంటనే అక్కడి నుంచి తన గుంపు వైపు పరుగులు తీసింది. జింకపిల్ల సురక్షితంగా వెళ్లిన తర్వాత ఏనుగు కూడా నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.
View this post on Instagram
ఏనుగు చూపించిన ఈ దయా గుణాన్ని, తెలివితేటలను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏనుగులకు ఎంత దయ ఉందో చూడండి.. కానీ మనుషులకు లేదని అంటున్నారు. మనుషుల కంటే జంతువులకే దయ ఎక్కువ అని కామెంట్లు పెడుతున్నారు. జంతువుల దయా గుణానికి సంబంధించిన ఇలాంటి వీడియోలు గతంలో కూడా చాలా వైరల్ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఒకసారి ఒక ఏనుగు పిల్ల బురద గుంటలో ఇరుక్కుపోతే, దాన్ని జేసీబీ యంత్రం సహాయంతో కాపాడారు. రెస్క్యూ తర్వాత, ఆ ఏనుగు పిల్ల జేసీబీ యంత్రాన్ని తన తొండంతో తాకి కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి సంఘటనలు జంతువులకు కూడా భావోద్వేగాలు, దయా గుణం ఉంటాయని నిరూపిస్తాయి. ఈ ఏనుగు, జింక కథ మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. ప్రకృతిలో ప్రతి జీవికి ప్రాణం విలువైనది. దయ, ప్రేమ చూపించడం ద్వారా అందరం కలిసిమెలిసి జీవించవచ్చని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.
ఇది కూడా చూడండి: The Raja saab Teaser: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ది రాజాసాబ్ టీజర్ డేట్ ఫిక్స్
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు