The Raja saab Teaser: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ది రాజాసాబ్ టీజర్ డేట్ ఫిక్స్

The Raja saab Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అభిమానులకు మరింత కిక్ ఇచ్చే వార్తను డైరెక్టర్ మారుతి తాజాగా వెల్లడించారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో ‘ది రాజా సాబ్’ సినిమా గురించి మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో.. దానికి మించి ఒక శాతం ఎక్కువే మీకు ఇస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదని మారుతి అన్నారు.
ప్రభాస్ పట్ల మీరు చూపించిన ప్రేమను చూశాను. అతనిపై నాకున్న అభిమానాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారని మారుతి అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే డైరెక్టర్ ఇటీవల టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా టీజర్ జూన్ 16న విడుదల కానుందని తెలిపారు. ఈ టీజర్‌లో ప్రభాస్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని ఒక డిఫరెంట్ రోల్‌లో చూడబోతున్నారని మారుతి అన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. సినిమా విడుదలకు కాస్త సమయం పట్టినా, అభిమానులకు నచ్చే విధంగా మారుతీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే నాలుగు పాటలు పూర్తయ్యాయి. మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా అంచనాలను మించి ఉంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు పక్కాగా బాక్సాఫీస్‌ను బద్దలు చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా రిలీజ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Read Also:World Brain Tumor Day : ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్‌ను ఎలా గుర్తించాలి? – నిపుణుల సలహాలు!