Pawan Kalyan : పంచెకట్టులో పవర్ స్టార్..అదిరిపోయిన పవన్ కళ్యాణ్ కొత్త లుక్

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెండి తెర మీదనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని అనేక గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రిగా తనదైన శైలిలో వాటిని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆయన కృషి చేస్తున్నారు. కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు అందుతుండడంతో గ్రామాలకు కొత్త రూపు వస్తోంది. ముఖ్యంగా, డిప్యూటీ సీఎంగా మారుమూల గ్రామాల్లో కూడా ఏడాదిలోపే రోడ్లు వేయించారు. ఈ విధంగా ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని 100 శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవన్‌ను తుఫానుతో పోలుస్తూ అభినందించారు. అప్పటి నుండి ఎన్‌డీఏ ప్రభుత్వంలో పవన్‌కు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పవన్ క్రేజ్‌ను ఉపయోగించుకొని పట్టు సాధించాలని చూస్తోంది.
Read Also: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్
ఇటీవల సనాతన ధర్మం నినాదాన్ని ఎత్తుకున్న పవన్, తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొద్ది నెలల క్రితం ఆయన తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ క్రేజ్‌ను ఉపయోగించుకొని ఇప్పుడు నుంచే అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఈ క్రమంలో ఆయన తమిళనాడులోని ఆలయాలను సందర్శించారు. డీఎంకే సిద్ధాంతాలపై కూడా ఆయన విమర్శలు సైతం చేశారు. దీంతో డీఎంకే నాయకులు కూడా పవన్‌ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు.
మురుగన్ నేలపైన అడుగుపెట్టిన సనాతన ధర్మ పరిరక్షకుడు గౌ|| ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్… pic.twitter.com/OdxKn9BSPn
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2025
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తాజాగా తమిళనాడులో అడుగుపెట్టారు. లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులతో ఈ సాయంత్రం జరగిన ‘మురుగన్ భక్త సమ్మేళనం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్నారు. మదురై ఎయిర్ పోర్టులో పవన్‌కు తమిళనాడు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అయితే, పవన్ తమిళనాడు స్టైల్‌లో పంచెకట్టులో కనిపించారు. పంచెకట్టుతో విమానం నుండి దిగుతున్న పవన్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో అభిమానులు పవన్ పంచెకట్టు లుక్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు
నిజానికి కుంభమేళా టైంలో కుంభమేళా సమయంలో పెద్దపొట్ట వేసుకొని చొక్కా లేకుండా పుణ్య స్నానాలు ఆచరించిన పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు సైతం కంగుతిన్నారు. ఎలా ఉండే మా హీరో ఎలా అయిపోయాడే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ అంటే పడని వాళ్లు మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఆ ట్రోల్స్ ని డిఫెండ్ కూడా చేసుకోలేని పరిస్థితి పవన్ ఫ్యాన్స్ కి ఏర్పడింది. అలాంటి పవర్ ప్రస్తుతం 30 ఏళ్ళ కుర్రాడి లుక్స్ లోకి మారిపోవడం పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.
-
Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ ఎమన్నాడంటే?
-
Elephant Attack: ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు