Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • International News News »
  • Corona Is Increasing Medical Gadgets That Every Home

Carona :పెరుగుతున్న కరోనా.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే

భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి. ముంబై, గురుగ్రామ్, చెన్నై, పుణె, హైదరాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.

Carona :పెరుగుతున్న కరోనా.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే
  • Edited By: kusuma,
  • Updated on May 24, 2025 / 02:25 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Carona : భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి. ముంబై, గురుగ్రామ్, చెన్నై, పుణె, హైదరాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. పరిస్థితి చేయి దాటకముందే ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉండాలి. కరోనా వ్యాపిస్తుండడంతో మనం ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మెడికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా వీటి అవసరం పడొచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త పడటం మంచిది.

1. పల్స్ ఆక్సిమీటర్ (Pulse Oximeter):
కోవిడ్ సోకిన వ్యక్తికి ఆక్సిజన్ స్థాయి (Oxygen Level), పల్స్ రేట్ (Pulse Rate) తరచుగా మారుతుంటాయి. ఇంట్లో ఆక్సిజన్, పల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ తప్పనిసరిగా ఉండాలి. మీరు ఆక్సిమీటర్‌ను ఆన్‌లైన్‌లో (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో) లేదా ఆఫ్‌లైన్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చు. ఇవి రూ.395 నుండి రూ.7000 వరకు వివిధ ధరలలో లభిస్తాయి.

Read Also: ఐపీఎల్ ఎండింగ్‌లో అదరగొడుతున్న సన్‌రైజర్స్.. ఎంత ఆడినా వృథానే

2. ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ (Infrared Thermometer):
కోవిడ్ సోకిన వారిలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. అందులో జ్వరం ఒక సాధారణ లక్షణం. జ్వరాన్ని ప్రతీ కొన్ని గంటలకు చెక్ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం ఇంట్లో తప్పనిసరిగా థర్మామీటర్ ఉండాలి. ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ అయితే చాలా ప్రయోజనకరం. ఎందుకంటే దీనితో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, ఇంట్లో మరొకరు కూడా జ్వరాన్ని చెక్ చేయవచ్చు. ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు కూడా మీకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వాటిలో రూ.649 నుండి రూ.11,778 వరకు వివిధ రకాల థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి.

3. స్టీమర్ (Steamer), నెబ్యులైజర్ మెషిన్ (Nebulizer Machine):
కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి దగ్గు (Cough), జలుబు (Cold) లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు డాక్టర్లు నెబ్యులైజర్ లేదా నీటి ఆవిరి (Steam) తీసుకోవాలని సలహా ఇస్తారు. అమెజాన్‌లో నెబ్యులైజర్ మెషిన్లు రూ.499 నుంచి రూ.7860 వరకు దొరుకుతాయి.

నోట్: ఈ మెడికల్ గ్యాడ్జెట్స్‌పై పూర్తిగా ఆధారపడడం సరికాదు. కోవిడ్ లాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వారి సలహా, సూచనల మేరకు నడుచుకోవాలి.

Tag

  • Corona
  • Infrared Thermometer
  • Nebulizer Machine
  • Pulse Oximeter
Related News
  • China danger virus: చైనాలో మరో కొత్త డేంజర్ వైరస్.. సోకితే ప్రాణాలకే ప్రమాదం

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us