AI Hospital : ప్రపంచపు మొట్టమొదటి AI ఆస్పత్రిని ప్రారంభించిన చైనా.. డాక్టర్లంతా రోబోలే

AI Hospital : మీకు అనారోగ్యం వచ్చింది.. దీంతో ఆ ఆస్పత్రికి వెళ్లారనుకోండి. అక్కడ మీకు రోగులు మాత్రమే కనిపిస్తున్నారు. డాక్టర్లు లేరు, నర్సులు ఉండరు, కనీసం రిసెప్షన్లో కూడా ఎవరూ కనిపించరు. అంతా రోబోలే మీ బాగోగులు చూసుకుంటాయి. వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉంది కదూ? కానీ, చైనా దీన్ని నిజం చేసి చూపించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆస్పత్రిని తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అయితే మనిషి ఊహలకు కూడా అందని విధంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో మనిషికి మరో మనిషితో పెద్దగా అవసరం లేకుండానే అన్ని పనులు ఏఐనే చేసేస్తుందేమో అనిపిస్తోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి చైనా ఇప్పుడు వైద్య రంగంలో ఒక సంచలనం సృష్టించింది. ఏజెంట్ హాస్పిటల్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆస్పత్రిని ప్రారంభించింది.
Read Also:Airtel: ఆన్లైన్ మోసగాళ్లకు షాక్.. ఎయిర్టెల్ అదిరిపోయే ఫీచర్
ఈ ఆస్పత్రి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ రోగులు తప్ప వేరే మనుషులు ఎవరూ ఉండరు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరూ వర్చువల్‌గానే ఉంటారు. అంటే, అంతా AIతోనే నడుస్తుంది. రోబోలే డాక్టర్లుగా రోగులను పరీక్షిస్తాయి. నర్సులుగా వారికి సేవలు అందిస్తాయి. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా చైనా దీన్ని నిజం చేసి చూపించింది.
ఈ వర్చువల్ ఆస్పత్రిని చైనాలోని పేరుగాంచిన సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు. దీన్ని కొద్ది రోజుల క్రితమే చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ AI ఆస్పత్రిలో ఏకంగా 14 మంది AI డాక్టర్లు, నలుగురు వర్చువల్ నర్సులు రోగులకు సేవలు అందిస్తారు. ఈ AI రోబో డాక్టర్లు చాట్‌జీపీటీ 3.5 టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. అంటే, మనం చాట్‌బాట్‌తో మాట్లాడినట్లే వారితో మాట్లాడి మన సమస్యలు చెప్పుకోవచ్చు. వారు మనల్ని పరీక్షించి సరైన చికిత్సను సూచిస్తారు. ఈ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, పిల్లల వైద్యం, గుండె సంబంధిత సమస్యలు ఇలా మొత్తం 21 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డాక్టర్లతో పోలిస్తే, ఈ AI డాక్టర్లు ట్రీట్మెంట్లో చాలా వేగంగా చేస్తారట.
Read Also:Strange Discovery: తవ్వకాల్లో బయటపడ్డ వింత… కూర్చున్న భంగిమలో 1000ఏళ్ల నాటి సమాధి బాబా
మనం మామూలుగా ఆస్పత్రికి వెళ్తే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు రోజుల తరబడి చికిత్స జరుగుతుంది. కానీ ఈ AI ఆస్పత్రిలో అదంతా నిమిషాల్లోనే అయిపోతుందట. ఒక రోజులో ఏకంగా 3 వేల మంది రోగులకు వైద్య సేవలు అందించే కెపాసిటీ ఈ ఆస్పత్రికి ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ AI ఆస్పత్రి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ AI రోబో డాక్టర్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో ఏకంగా 93.06శాతం స్కోర్ సాధించారట. అంటే, మనుషుల డాక్టర్ల కంటే కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారన్నమాట. అంతేకాదు, ఈ AI డాక్టర్లు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉంటాయట. ఈ AI ఆస్పత్రి భవిష్యత్తులో డాక్టర్లు కాబోయే విద్యార్థులకు పాఠాలు కూడా చెబుతుందట. వైద్య విద్యలో ఇది ఒక పెద్ద మార్పుకు నాంది పలకనుంది. వైద్య విద్యార్థులు ఇక్కడ చాలా వాస్తవికమైన వాతావరణంలో శిక్షణ పొందవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి AI ఆస్పత్రులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
-
Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
Pig Liver To Human: వైద్యశాస్త్రంలో మరో అద్భుతం.. మానవునికి పంది కాలేయం
-
BYD Car: ఎలక్ట్రిక్ కారు సంచలనం.. 5 నిమిషాల్లో 470 కి.మీ.అన్ని కార్లకు చెక్
-
China: ఈ కంపెనీ ఎంప్లాయిస్ పెళ్లి చేసుకోకపోతే.. ఉద్యోగం గోవిందా.. ఎక్కడంటే?
-
Virus: చైనాలో పుట్టిన కరోనాలాంటి మరో వైరస్.. వామ్మో ఇది ఇంత ప్రమాదమా?