Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!

Microsoft Lay Offs: ఐటీ రంగంలో ఎప్పుడూ కూడా టాప్‌లో ఉంటుందని అనుకునే వారు. కానీ ప్రస్తుతం ఏఐ వచ్చినప్పటి నుంచి ప్రతీ సంస్థలో ఎక్కువగా లేఆఫ్స్ అవుతున్నాయి. చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు అన్నింట్లో కూడా లేఆఫ్స్ తప్పడం లేదు. ఒక సంస్థలో ఎంత నమ్మకంతో ఎక్కువ ఏళ్లు పనిచేసినా కూడా చివరకు తీసేస్తున్నారు. దీనివల్ల ఎందరో టెకీ ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్నారు. టాప్ కంపెనీలు అయినా ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా ప్రతీ కంపెనీలో కూడా ఉద్యోగస్తులను తొలగిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వేలాది మంది ఉద్యోగస్తులను సంస్థ నుంచి తొలగించాలని భావిస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ ఉద్యోగస్తులను తొలగించడం ఇదేం మొదటిసారి కాదు. ఇలా ఉద్యోగాలను తొలగించాలని అనుకోవడం ఇది రెండోసారి. ఇప్పుడున్న వారిలో ఒక 4 శాతం మంది ఉద్యోగస్తులను తొలగించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.
మైక్రోసాఫ్ట్ కంపనీ ఉద్యోగస్తులను తొలగించాలనే నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏఐ అని తెలుస్తుంది. ఏఐ వర్క్ చేయడంతో ఇంకా ఎక్కువ మంది ఉద్యోగస్తులతో అవసరం లేదు. కొంతమంది ఉద్యోగస్తులను తొలగించడం వల్ల బడ్జెట్ కాస్త తగ్గుతుంది. కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులను కూడా తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఏడాదిలో మైక్రోసాఫ్ట్ మూడోసారి ఇలా ఉద్యోగస్తులను తొలగించాలని అనుకోవడంతో మిగతా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి ఇలా వేల మంది ఉద్యోగాలను తొలగించడం వల్ల వారు ఇబ్బంది పడతారు. కనీసం ఎలాంటి నోటీసులు ముందు చెప్పకుండా ఇలా ఉద్యోగం నుంచి తీయడం వల్ల ఇబ్బంది పడతారని అంటున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ మూడవసారి వేలాది మంది ఉద్యోగులను ఎక్కువగా మార్కెటింగ్ విభాగం నుండి తొలగింపులను ప్లాన్ చేస్తోంది. మే నెలలో 6,000 మంది ఉద్యోగస్తులను తొలగించగా, ఆ తర్వాత మళ్లీ 300 కి పైగా ఉద్యోగస్తులను తొలగించింది. ఇప్పుడు మళ్లీ వేల మందికి తొలగించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ఇలా ఉద్యోగస్తులను తొలగించడం అవుతుంది. ప్రముఖ టెక్ కంపెనీలోనే ఇలా లేఆఫ్స్ ఉంటే.. మిగతా కంపెనీలలో ఎలా ఉంటుందని టెకీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఏఐ వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి. ముఖ్యంగా టెకీ రంగంలో అయితే అధికంగా ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఉద్యోగస్తులు చేయాల్సిన పనులు అన్ని కూడా ఏఐ చేయడంతో బడ్జెట్‌ను తగ్గించుకోవడానికి టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.
ఇది కూడా చూడండి: Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
AI Videos: అమ్మాయిలతో ఏంట్రా ఈ పనులు?
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Doctors Day Special : ఏఐ vs. డాక్టర్లు.. హెల్త్ విషయంలో ఎవరిపై నమ్మకం ఉంచాలి?
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక