Doctors Day Special : ఏఐ vs. డాక్టర్లు.. హెల్త్ విషయంలో ఎవరిపై నమ్మకం ఉంచాలి?

Doctors Day Special : ఈరోజుల్లో ఎక్కడ చూసినా AI గురించే చర్చ నడుస్తుంది. ఎడ్యుకేషన్, మీడియా, వైద్యరంగంలోకి కూడా ఏఐ అడుగుపెట్టింది. కానీ ఇప్పుడో ప్రశ్న అందరి మదిలో మెదలుతుంది. AI అనేది నిజంగా డాక్టర్ల ప్లేస్ రీ ప్లేస్ చేయగలుగుతుందా ? రోగులను AI టూల్స్ చూసుకుంటాయా? నిపుణులు ఈ విషయంలో ఏం చెబుతున్నారు? AI వల్ల లాభం ఉందా, లేక ప్రమాదమా? వివరంగా తెలుసుకుందాం.
AI మెడికల్ రంగంలో చాలా పనులు చేయగలదు. అయితే, భవిష్యత్తులో కూడా AI ఎప్పుడూ డాక్టర్ల స్థానాన్ని తీసుకోదని పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. రోగికి చికిత్స కేవలం మెషిన్లతో జరగదు. డాక్టర్ల అనుభవం, మనుషుల గురించి అర్థం చేసుకోవడం, వారిపై చూపించే ప్రేమ, రోగితో ఏర్పడే బంధం చాలా అవసరం. ఒక డాక్టర్.. రోగి మాట తీరు, వారి మానసిక పరిస్థితి, కుటుంబ సమస్యలను కూడా అర్థం చేసుకోగలరు. కానీ, ఒక మెషిన్ అయిన AIకి ఇది సాధ్యం కాదు. కొంతమంది డాక్టర్ సలహా లేకుండా కేవలం AIపై ఆధారపడడం మొదలుపెడుతున్నారు. అలా చేస్తే చాలా ప్రమాదం. డేటా లీక్ అవ్వొచ్చు, లేదా తప్పుడు చికిత్స జరగవచ్చు అని ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Also:Thammudu : తమ్ముడు ట్రైలర్ లో అదొక్కటే మైనస్.. ఈసారి నితిన్ పరిస్థితి ఏంటంటే?
మెడికల్ ఫీల్డ్‌లో AI ఏం చేయగలదు?
AI డాక్టర్లకు సహాయం చేయడంలో అద్భుతంగా పనిచేయగలదు. దాని ముఖ్యమైన పనులు ఇవే..
డేటా అనాలిసిస్: AI సహాయంతో రోగుల రిపోర్ట్స్, ఎక్స్-రే, MRI, CT స్కాన్ వంటి టెస్టులను చాలా వేగంగా అనలైజ్ చేయవచ్చు. ఇది ఒక రోగికి ఏ జబ్బు ఉందో గుర్తించడంలో డాక్టర్‌కు సహాయపడుతుంది.
రిస్క్ ప్రిడిక్షన్: ఒక రోగికి భవిష్యత్తులో ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉందో కూడా AI అంచనా వేయగలదు.
రిమోట్ హెల్త్ మానిటరింగ్: ఇప్పుడు మనం వాడే స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు AIతో అనుసంధానమై ఉంటాయి. అవి మన బీపీ, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాయి. డాక్టర్‌కి చెప్పడానికి ముందే ఇవి మనకు హెచ్చరిక ఇస్తుంటాయి.
రోబోటిక్ సర్జరీలు: కొన్ని రోబోటిక్ సర్జరీలలో కూడా AI సహాయం తీసుకుంటారు. కానీ ఇది కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతుంది.
AI అనేది డాక్టర్లకు ఒక మంచి అసిస్టెంట్ టూల్ మాత్రమే. టెక్నాలజీ ఉద్దేశం డాక్టర్లను తీసేయడం కాదు, వారి కెపాసిటీని ఇంకాస్త పెంచడం. AIని సరైన విధంగా, జాగ్రత్తగా ఉపయోగిస్తే, అది వైద్య రంగానికి ఒక వరం లాంటిది. అలా అని కేవలం AIపైనే ఆధారపడటం మాత్రం చాలా ప్రమాదం. రోగికి ఎప్పుడూ డాక్టర్ అవసరం ఉంటుంది.
Read Also:Dil Raju : దిల్ రాజుకు ‘గేమ్ చేంజర్’ దెబ్బ.. ఏకంగా రూ.100 కోట్లు లాస్.. ఎలా కవర్ చేశాడంటే ?
-
AI Videos: అమ్మాయిలతో ఏంట్రా ఈ పనులు?
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
Whatsapp AI: బోర్ కొడుతుందా.. వాట్సాప్‌లో ఏఐ ఫ్రెండ్‌తో ఇలా మాట్లాడండి
-
Blood Test : రక్తం తీయకుండానే బ్లడ్ టెస్ట్.. 20 సెకన్లలో ఫేస్ స్కాన్‌తో రిపోర్టులు రెడీ
-
Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు
-
AI Hospital : ప్రపంచపు మొట్టమొదటి AI ఆస్పత్రిని ప్రారంభించిన చైనా.. డాక్టర్లంతా రోబోలే