Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు

Civil Services Exam :యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కీలక మార్పులు తీసుకురాబోతోంది. ఇకపై పరీక్షల్లో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ను తప్పనిసరి చేయడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)ను కూడా ఉపయోగించనుంది. నకిలీలను, ఇతర అక్రమాలను అరికట్టడానికి యూపీఎస్సీ ఈ కొత్త విధానాన్ని ఈ ఏడాదే అమలు చేయాలని నిర్ణయించింది
గతంలో వెలుగులోకి వచ్చిన పూజా ఖేడ్కర్ కేసు కారణంగా యూపీఎస్సీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పూజా ఖేడ్కర్ ఒకప్పటి ఐఏఎస్ ప్రొబేషనర్. ఆమెపై నకిలీ, దుష్ప్రవర్తన ఆరోపణలు రావడంతో గతేడాది ఆమెను సర్వీసు నుంచి తొలగించారు. అసలు విషయం ఏంటంటే.. సీఎస్ఈ 2022 పరీక్షకు ఖేడ్కర్ అర్హతకు మించి ఎక్కువసార్లు హాజరయ్యారని పేర్కొంటూ యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని జూలై 2024లో రద్దు చేసింది.
దీనికోసం ఆమె తన పేరు, తన తల్లిదండ్రుల పేర్లతో వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఆమెను సర్వీసు నుంచి తొలగించింది. అయితే, పూజా ఖేడ్కర్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించి, కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేశారు. పూజా ఖేడ్కర్ కేసు బయటపడిన తర్వాత, యూపీఎస్సీ 2009 నుంచి 2023 వరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన 15,000 మందికి పైగా అభ్యర్థుల డేటాను పరిశీలించింది. ఈ పరిశీలనల ఫలితంగానే ఈ కొత్త సిస్టమ్ తీసుకురావాలని నిర్ణయించింది.
Read Also:Viral Video : డిక్కీలో 50క్వార్టర్ బాటిళ్లు.. స్కూటీలో ఏకంగా వైన్ షాపే పెట్టాడుగా
కొత్త వ్యవస్థ ఎలా ఉంటుంది?
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు, AI వినియోగం ఈ ఏడాది జూన్ నుంచే అమలులోకి రానుంది. అయితే, మే 25న జరగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025లో ఈ వ్యవస్థ అమలు కాదు.
యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ A, గ్రూప్ B స్థానాలకు రిక్రూట్ మెంట్ కోసం 14 మెయిన్ ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. వీటిలో ఎన్‌డిఎ (NDA), ఫారెస్ట్ ఆఫీసర్ (Forest Officer) వంటి అనేక ముఖ్యమైన ఎగ్జామ్స్ ఉన్నాయి.
Read Also:Viral Video : గుర్రం ఒక్క కిక్ ఇచ్చింది.. దెబ్బకు పరుగులంకించుకున్న పిట్ బుల్
కొత్త సిస్టమ్ లో ఏం జరుగుతుంది?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు వ్యవస్థను అమలు చేయబోతోంది. ఈ కొత్త విధానం కింద, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వేలిముద్రలను ధృవీకరిస్తారు. అంతేకాకుండా, ముఖ గుర్తింపు (face recognition), క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ-అడ్మిట్ కార్డులను స్కాన్ చేయడం, నకిలీలను అరికట్టడానికి పరీక్ష సమయంలో AI ఆధారిత సీసీటీవీ నిఘా వంటివి కూడా ఉంటాయి. ఈ మార్పులు పరీక్షల ప్రక్రియను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చనున్నాయి.