Viral Video : గుర్రం ఒక్క కిక్ ఇచ్చింది.. దెబ్బకు పరుగులంకించుకున్న పిట్ బుల్

Viral Video : ఎవరితోనూ అనవసరంగా పెట్టుకోకూడదని అంటారు. ఎందుకంటే, చివరికి పంచాయితీ పెట్టుకున్న వాడే చిక్కుల్లో పడతాడు. ఈ సామెత మనుషులకే కాదు, జంతువులకు కూడా అంతే కరెక్ట్‌గా వర్తిస్తుంది. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక కుక్క అనవసరంగా ఒక గుర్రంతో తలపడాలని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ కుక్క కలలో కూడా ఊహించి ఉండదు.
పిట్ బుల్(ఓ రకమైన జాతి కుక్క) ఎంత ప్రమాదకరమైనదో మనందరికీ తెలుసు. దాని కాటు పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానిని చూస్తేనే ఎవరైనా భయంతో పారిపోవాల్సిందే. తనకున్న ఇదే బలంతో ఆ కుక్క కొన్నిసార్లు తప్పుగా గొడవలకు దిగుతుంది. ఇప్పుడు అదే బలంతో ఒక గుర్రంతో పెట్టుకున్న పిట్ బుల్ ఊహించని పరిణామాన్ని ఎదుర్కొంది. ఈ వీడియోను పూర్తిగా చూసిన వాళ్లకు తప్పు కుక్కదే అని అర్థం అవుతుంది. అనవసరంగా గుర్రంతో గొడవపడాలని చూసినందుకు చివరికి అది మూల్యం చెల్లించుకుంది.
Read Also:Spirit Movie: ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన లక్కీ గార్ల్ త్రిప్తి డిమ్రీ
Kalesh b/w Dogesh and Ghodesh: pic.twitter.com/9FKLdzmuCN
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 23, 2025
వీడియోలో చూస్తుంటే, రెండు గుర్రాలు ఒక ఇంటి పక్కగా వెళ్తుంటాయి. ఇంతలో ఒక పిట్ బుల్ అక్కడికి వచ్చి వాటిలో ఒక గుర్రాన్ని కొరకడం మొదలుపెడుతుంది. కుక్క దాడిని చూసి గుర్రం పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కుక్క కూడా దాని వెంట పడుతుంది. ఒకానొక దశలో గుర్రం తనను తాను రక్షించుకోవడానికి కుక్క దాడికి కిక్‌తో సమాధానం ఇస్తుంది. గుర్రం ఇచ్చిన ఆ కిక్ ఎంత వేగంగా ఉంటుందంటే, పాపం ఆ కుక్క ప్రాణాలు కాపాడుకొని పరుగు లంకించుకుంటుంది. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను X (ట్విట్టర్) లో @gharkekalesh అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను చూసి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్.. మంచి పని జరిగింది..అనవసరంగా గొడవ పెట్టుకునే వారికి ఇలాగే జరగాలని రాశారు. మరొకరు, “కుక్క సరైన సమయంలో పారిపోయింది.. లేకపోతే ఆ గుర్రం దాని పరిస్థితి దారుణంగా మార్చేసేది” అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు “అనవసరంగా గొడవ పడేవారికి ఇదే గతి” అని అన్నారు.
Read Also:Kia Carens Clavis : ఇన్నోవాకు కష్టకాలం మొదలు.. రూ.11.49లక్షలకే 7సీటర్ కారు
-
Viral Video : డిక్కీలో 50క్వార్టర్ బాటిళ్లు.. స్కూటీలో ఏకంగా వైన్ షాపే పెట్టాడుగా
-
Kangna Sharma : “బట్టలు విప్పే పోటీ జరుగుతోందా?”.. కంగనా శర్మపై నెటిజన్ల ట్రోలింగ్!
-
Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు
-
Viral Video : వీడికి రెండు గుండెలున్నాయా భయ్యా.. ప్రాణం పోతున్నా వీడియో తీశాడు
-
Viral Video : కర్మ అంటే ఇదే.. గాడిద కొట్టిన దెబ్బకు జీవితాంతం మర్చిపోలేడు
-
Viral Video : రీల్స్ పిచ్చితో ప్యాంట్‌కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?