Spirit Movie: ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన లక్కీ గర్ల్ త్రిప్తి డిమ్రీ

Spirit Movie: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా స్క్రీన్‌ప్లే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు సందీప్ త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో బాలీవుడ్‌లోని పలువురు అగ్ర తారల పేర్లు వినిపించాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించే అవకాశం తృప్తి డిమ్రికి దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సందీప్ ప్రకటించడంతో పుకార్లకు తెరపడింది.
ప్రభాస్ టీం నుంచి రెండో అధికారిక ప్రకటన
‘స్పిరిట్’ ప్రాజెక్ట్ నటీనటుల గురించి ప్రభాస్ టీం నుంచి వచ్చిన రెండో అధికారిక ప్రకటన ఇది. తాజా ప్రకటన ప్రకారం.. ఈ సినిమా సుమారు 9 భాషల్లో రూపొందనుంది. తృప్తి డిమ్రి పేరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషలలో కూడా రాశారు. ఈ ప్రకటన ‘స్పిరిట్’ ఒక పాన్ వరల్డ్ సినిమాగా (Pan-World Film) రూపొందుతుంది.
Read Also:Oben Electric : స్ప్లెండర్, ప్లాటినా గట్టి షాక్.. లక్షలోపే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ పై చర్చలు మొదలయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారిగా ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు సందీప్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. షూటింగ్ కోసం మెక్సికోలోని కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నామని అక్కడే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
View this post on Instagram
విలన్‌గా కొరియన్ స్టార్ ?
దక్షిణ కొరియా స్టార్ నటుడు మా డాంగ్-సియోక్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తృప్తి డిమ్రి పేరును కూడా కొరియన్ భాషలో రాయడం ద్వారా ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది. అయితే, ‘స్పిరిట్’ టీం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది!
Read Also:Netflix : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. జూన్ 2 నుంచి ఆ డివైజ్‌లలో సర్వీసులు బంద్
ఆనందంలో తృప్తి డిమ్రి
ఈ సినిమాలో ఎంపికైనందుకు తృప్తి డిమ్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “నేను ఇప్పటికీ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. ఈ ప్రయాణంలో నన్ను నమ్మినందుకు కృతజ్ఞురాలిని. సందీప్ రెడ్డి వంగా మీ విజనరీ క్రియేషన్‌లో భాగమైనందుకు ధన్యవాదాలు” అని ఆమె అన్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో తృప్తి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత, రాబోయే ‘యానిమల్ పార్క్’లో కూడా ఈ అందాల తార మెరవనుంది. అంతేకాకుండా, ఆమె అనేక బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు.
-
Manchu Vishnu: నాన్న కోసమే ఇదంతా చేస్తున్నా.. మంచు విష్ణుసంచలన నిజాలు
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్‌డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
MS Dhoni and Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్న ధోని… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Salaar ReRelease : నెమ్మదించిన ‘సలార్’ రీ రిలీజ్ బుకింగ్స్..వచ్చిన గ్రాస్ ఇంతేనా?
-
Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ స్టోరీ లీక్..ఆ సూపర్ హిట్ సినిమాకి కాపీనా?