Kia Carens Clavis : ఇన్నోవాకు కష్టకాలం మొదలు.. రూ.11.49లక్షలకే 7సీటర్ కారు

Kia Carens Clavis : భారతదేశంలో ఇటీవలే లాంచ్ అయిన కొత్త కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ మోడల్ షోరూమ్‌లకు రావడం ప్రారంభం అయింది. ఈ 7 సీటర్ కారు డెలివరీలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. కొత్త కియా కారెన్స్ క్లావిస్ ప్రస్తుతం ఉన్న కారెన్స్ మోడల్ కంటే కాస్త పై లెవల్ ది. దీని ధరలు రూ.11.49 లక్షల నుంచి రూ.21.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
కియా కారెన్స్ క్లావిస్ మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+. ఈ కారు లోపలి భాగాన్ని కొత్త 26.62-అంగుళాల పనోరమిక్ డిస్ప్లేతో అందిస్తున్నారు. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిసి ఉంటాయి. దీనికి తోడు కొత్తగా డిజైన్ చేసిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ కియా లోగోతో వస్తుంది. ఈ మోడల్ తన త్రీ లైన్ సీటింగ్ లేఅవుట్‌తో వస్తుంది. ఇప్పుడు థర్డ్ లైన్ చేరుకునేందుకు మధ్య వరుస సీట్లలో వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్ (ఒక బటన్ నొక్కగానే సీటు పూర్తిగా ముందుకు పడిపోవడం) సదుపాయం ఉంది.
Read Also:Netflix : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. జూన్ 2 నుంచి ఆ డివైజ్‌లలో సర్వీసులు బంద్
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. రెండవ వరుస సీట్లు ఇప్పుడు స్లైడింగ్, రెక్లైనింగ్ ఫంక్షన్‌తో వస్తాయి. క్లావిస్లో 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, అన్ని విండోలను కంట్రోల్ చేసేందుకు స్మార్ట్ కీ సిస్టమ్ ఉన్నాయి. అలాగే, సీటులో అమర్చిన ఎయిర్ ప్యూరిఫైయర్ (పైకప్పు వెంట్లతో), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, నాలుగు విధాలుగా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు వంటి ఎక్స్ ట్రా ఫీచర్లు కూడా ఉన్నాయి.
కియా కారెన్స్ క్లావిస్ లెవెల్ 2 ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) తో వచ్చింది. దీనివల్ల ఈ ఎంపీవీలో 20కి పైగా డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), రియర్ ఆక్యుపెంట్ అలర్ట్ , మొత్తం 18 యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also:Baal Aadhaar : ‘బాల్ ఆధార్’ వ్యాలిడిటీ 5 ఏళ్లే..ఆలస్యం చేస్తే పనికిరాదు.. ఇప్పుడు ఏం చేయాలంటే ?
అప్డేట్ చేయబడిన కారెన్స్ క్లావిస్లో మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇది 113 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ఇది 158 bhp పవర్‌ను అందిస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ లో 114 bhp పవర్ అందిస్తుంది. తక్కువ ధరలో ఇంతటి ఫీచర్లు, సేఫ్టీతో వస్తున్న కియా కారెన్స్ క్లావిస్ మార్కెట్లో ఇన్నోవా వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.