Baal Aadhaar : ‘బాల్ ఆధార్’ వ్యాలిడిటీ 5 ఏళ్లే..ఆలస్యం చేస్తే పనికిరాదు.. ఇప్పుడు ఏం చేయాలంటే ?

Baal Aadhaar : ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరి గుర్తింపునకు ఒక కీలకమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి స్కూల్ అడ్మిషన్లు, బ్యాంకింగ్ వ్యవహారాలు, గుర్తింపు కార్డుగా దాదాపు అన్ని చోట్లా ఇది అవసరం అవుతుంది. సాధారణంగా ఒకసారి ఆధార్ కార్డు తీసుకుంటే జీవితాంతం చెల్లుతుంది. కానీ పిల్లల కోసం ఇచ్చే ‘బాల్ ఆధార్’ (Baal Aadhaar) లేదా ‘బ్లూ ఆధార్’ (Blue Aadhaar) కార్డులకు మాత్రం ప్రత్యేక రూల్స్ ఉంటాయి.
ఏంటి ఈ బ్లూ ఆధార్ కార్డ్?
బ్లూ ఆధార్ కార్డ్ అనేది ప్రత్యేకంగా 5 సంవత్సరాల లోపు పిల్లల కోసం తయారు చేస్తారు. ఇది సాధారణ ఆధార్ కార్డుకు భిన్నంగా ఉంటుంది. దీన్ని సులభంగా గుర్తించడానికి బ్లూ కలర్ థీమ్‌తో రూపొందిస్తారు. చిన్న పిల్లలకు వేలిముద్రలు (ఫింగర్‌ప్రింట్స్), కనుపాపలు (ఐరిస్) పూర్తిగా అభివృద్ధి చెందవు కాబట్టి ఈ కార్డును తయారు చేసేటప్పుడు బయోమెట్రిక్ డేటా అవసరం ఉండదు. బ్లూ ఆధార్ వెరిఫికేషన్ కోసం పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో ఎవరిదైనా ఒకరి ఆధార్ కార్డు తప్పనిసరి. పిల్లల సమాచారం తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ అవుతుంది.
Read Also:Karnataka : నాకో లవర్ ఉన్నాడు.. మండపంలో ధైర్యంగా వధువు చేసిన పని వైరల్.. వీడియో
ఎప్పుడు, ఎందుకు అప్డేట్ చేయాలి?
పిల్లలకు 5 సంవత్సరాలు రాగానే వారి ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, కనుపాపల స్కాన్) యాడ్ చేసుకోవాలి. దీని కోసం దగ్గర్లోని ఆధార్ సర్వీసు సెంటర్ కు వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ అప్డేట్ పూర్తిగా ఉచితం, దీని వల్ల ఆధార్ నంబర్ మారదు. కేవలం బయోమెట్రిక్ సమాచారం మాత్రమే అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత పిల్లలకు 15 ఏళ్లు నిండినప్పుడు మరోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. ఇది కూడా ఉచితమే.
బాల్ ఆధార్ ఎలా తీసుకోవాలి?
మీరు మీ పిల్లల కోసం బాల్ ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఈ కింది పద్ధతిని పాటించాలి
* UIDAI వెబ్‌సైట్‌కు వెళ్లండి: అధికారిక వెబ్సైట్ uidai.gov.in ఓపెన్ చేయండి.
* అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి: ‘My Aadhaar’ ట్యాబ్‌లో ‘Book an Appointment’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
* సెలక్ట్ సర్వీస్ సెంటర్ : UIDAI సర్వీసు సెంటర్ సెలక్ట్ చేసుకుని మీ నగరాన్ని ఎంచుకోవాలి.
* వివరాలు నింపాలి : మీ మొబైల్ నంబర్, క్యాప్చా నింపాలి. ‘Get OTP’ పై క్లిక్ చేయండి.
* OTP వెరిఫికేషన్: మీ ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి.
* కేంద్రాన్ని సందర్శించాలి: నిర్ణీత తేదీ, సమయానికి ఆధార్ సర్వీసు సెంటర్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.
Read Also:No Theatre Shutdown: థియేటర్ల బంద్ లేదు.. జూన్ 1 నుంచి యథావిధిగా సినిమా ప్రదర్శనలు
బాల్ ఆధార్ కార్డ్ పిల్లలకు ప్రభుత్వ పథకాలు, మిగతా సేవలను పొందడంలో చాలా సహాయపడుతుంది. 5 సంవత్సరాల వయస్సు రాగానే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దీన్ని సకాలంలో అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.