Aadhaar card: ఆధార్ కార్డు విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తే.. జైలు శిక్ష తప్పదు
దేశంలో ఉండే ప్రతీ భారతీయ పౌరులకు ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోతే అసలు ఏ పని కూడా జరగదు. ఏ చిన్న పని ప్రారంభించినా కూడా తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి.

Aadhaar card: దేశంలో ఉండే ప్రతీ భారతీయ పౌరులకు ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోతే అసలు ఏ పని కూడా జరగదు. ఏ చిన్న పని ప్రారంభించినా కూడా తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. లేకపోతే ఆ పని జరగడం కూడా కష్టమే. బ్యాంక్ అకౌంట్, ఒక సిమ్ తీసుకోవాలనుకున్నా, ఇలా ప్రతీ దానికి కూడా ఇప్పుడు ఆధార్ కార్డు ఉండాలి. కానీ కొందరు ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తున్నారు. మంచి విషయాలకి వాడకుండా.. చెడుకి ఎక్కువగా వాడుతున్నారు. ఇలా ఎవరైనా వాడితే మాత్రం తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు దుర్వినియోగం కోసం ఆధార్ కార్డులో తప్పుడు సమాచారం ఇచ్చినా లేకపోతే నేరానికి ఉపయోగించినా కూడా జైలు శిక్ష తప్పదు. అయితే ఏ పనులు చేయడం వల్ల శిక్ష పడుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: పెళ్లయిన తర్వాత విడాకులకు కారణాలు ఇవేనా?
ఎవరైనా ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన ఆధార్ కార్డులో తప్పుడు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారం ఉంచితే మాత్రం తప్పకుండా శిక్ష పడుతుంది. ఇలా తప్పుడు వివరాలు నమోదు చేయడం నేరం. అలాగే ఇలా తప్పుడు వివరాలతో వేరే వారి గుర్తింపు కార్డును దుర్వినియోగం చేసినా కూడా నేరం. నకిలీగా ఇలా చేస్తే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొందరు ఒకరి ఆధార్ నంబర్, బయో మెట్రిక్‌ను ఇలా తప్పుగా ఉపయోగిస్తారు. ఇలా చేస్తే మాత్రం నేరంగా పరిగణించి.. శిక్ష విధిస్తారు. కావాలని ఒకరి ఆధార్‌ను ఇంకొకరు ఉపయోగిస్తే.. రూ .10,000 నుంచి రూ.1,00,000 వరకు జరిమానా ఉండటంతో పాటు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.
అనుమతి లేకుండా ఇతరుల ఆధార్ డేటాను తీసుకున్నా కూడా వారికి మూడేళ్ల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది.
కొందరు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని నింపుతారు. అంటే కొన్ని నకిలీ డాక్యుమెంట్ల కోసం తప్పుడు వివరాలు నమోదు చేస్తారు. వీటితో వారు తప్పుడు కార్యక్రమాలకు పాల్పడతారు. అయితే ఇలా చేయడం కూడా నేరం. మీ ఒరిజినల్ వివరాలను మాత్రమే ఇతరులకు ఇవ్వాలి. అయితే ఆధార్ విషయంలో ఏవైనా విషయాలు తెలియాలంటే యూఐడీఏఐ వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఆధార్ వివరాలు చెక్ చేసుకోండి. అలాగే మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. దీనివల్ల ఏదైనా దుర్వినియోగం జరిగితే వెంటనే మీకు పాస్వర్డ్ వస్తుంది. ఈ ఆధార్ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే యూఐడీఏఐ హెల్ప్ లైన్ నంబర్ 1947కు కాల్ చేయండి. అలాగే help@uidai.gov.in కు ఇమెయిల్ చేయండి.
-
Cooking Oil: ఈ నూనెలు వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అంతే సంగతులు ఇక
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Mega family: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
-
Financial Problems: ఈ దిశలో బీరువా పెడితే.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
-
Milk to Your Children: నిద్రపోయే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Couples: దంపతులు ఈ టిప్స్ పాటిస్తే.. 30 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీ