Lost your Aadhaar card: ఆధార్ కార్డు పోయిందా.. ఇక నో టెన్షన్
Lost your Aadhaar card: ఆధార్ కార్డు పోతే ఎక్కువగా టెన్షన్ కావక్కర్లేదు. ఈజీగా మీరు ఇ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒరిజినల్ ఆధార్‌లాగానే ఉంటుంది.

Lost your Aadhaar card: ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. అన్నింటికి కూడా ఈ ఆధార్ కార్డును వాడుతున్నారు. అసలు ఈ ఆధార్ కార్డు లేకపోతే ఎలాంటి పనులు కూడా జరగవు. ట్రైన్ టికెట్ నుంచి ఆసుపత్రి ఇలా అన్నింటి దగ్గర కూడా ఈ ఆధార్ కార్డు ఉండాలి. దీంతో చాలా మంది దీన్ని చేతులో పట్టుకుని తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొందరు పడేస్తుంటారు. ఆధార్ కార్డు చాలా టెన్షన్ అవుతారు. ఎందుకంటే దీంతో ఎవరైనా తప్పుడు చర్యలకు పాల్పడటం, అక్రమంగా ఏదైనా చేయడం వంటివి చేస్తుంటారు. ఇదే కాకుండా మళ్లీ అది దొరకడం కష్టమని భావిస్తారు. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆధార్ కార్డు పోతే ఇప్పుడు ఈజీగా కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ఆధార్ కార్డు పోతే ఎక్కువగా టెన్షన్ కావక్కర్లేదు. ఈజీగా మీరు ఇ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒరిజినల్ ఆధార్‌లాగానే ఉంటుంది. అయితే మీరు ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే https://eaadhaar.uidai.gov.in లేదా https://uidai.gov.in యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఆధార్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అయితే ఆ తర్వాత మూడు ఆప్షన్లు వస్తాయి. అందులో మీరు ఒక ఆప్షన్ మాత్రమే ఎంచుకోవాలి. ఆధార్ నంబర్ (యూఐడీ), ఎన్రోల్మెంట్ నంబర్ (ఈఐడీ), వర్చువల్ ఐడీ (వీఐడీ) అనే మూడు ఆప్షన్లు వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత డిటైల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. ఇలా చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అయితే ఇలా చేశాక మీ ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. అంతే ఇక మీ ఈ-ఆధార్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. అయితే దీన్ని మీరు ఓపెన్ చేయడానికి మీ పేరు, పుట్టిన సంవత్సరం మొదటి నాలుగు అక్షరాలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవాలి.
ఈ యూఐడీఏఐ జారీ చేసిన ఇ-ఆధార్ పూర్తిగా చెల్లుతుంది. దీన్ని ప్రింట్ తీసి అన్ని చోట్ల కూడా ఐడెంటిటీ కార్డుగా ఉపయోగించుకోవచ్చు. పీవీసీ కార్డు కావాలంటే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో రూ .50 చెల్లించడం ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఇందులో క్యూఆర్ కోడ్స్, సెక్యూరిటీ ఫీచర్లు, హోలోగ్రామ్లు ఉన్నాయి.
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ వార్.. అమెరికా రంగంలోకి దిగుతుందా?
-
Kerala Tour Just 14000: కేరళ టూర్ జస్ట్ 14000.. ఎంజాయ్ చేయడానికి త్వరపడండి